Mega Heroes: మామూలుగా ఒకే ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు ముందు నుండే భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి కామన్‌గా ఉండే ఫ్యాన్స్ అంతా కొత్తగా అడుగుపెట్టే హీరోల డెబ్యూపై భారీ అంచనాలతో ఉంటారు. వారి యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియకపోయినా ముందు నుండే వారికి సపోర్ట్‌గా నిలబడుతున్నారు. అలా చిరంజీవి ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయిపోయారు. అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ హీరోకు వారు అభిమానులే. అందుకే ఈ అభిమానులంతా మెగా హీరోలు అందరినీ కలిపి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా పలువురు యంగ్ మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అలరించారు.
రీలోడ్ అవుతాం
ప్రస్తుతం మెగా హీరోలంతా ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. చిరంజీవి నుండి రామ్ చరణ్ వరకు చాలావరకు హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తూ ఫ్యాన్స్‌ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఎవరి మూవీ కోసం వారు కష్టపడుతున్నారు. అలా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), వరుణ్ తేజ్ (Varun Tej) తాజాగా జిమ్‌లో కలిసి కసరత్తులు చేస్తూ కనిపించారు. ఆ ఫోటోను సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘మేము రెస్ట్ తీసుకోం. కలిసి రీలోడ్ అవుతాం’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ఈ మెగా హీరో. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ ఫ్రేమ్ చూడముచ్చటగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
లుక్స్ అదుర్స్
రామ్ చరణ్ (Ram Charan) చివరిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’లో హీరోగా కనిపించాడు. భారీ బడ్జెట్‌తో, దాదాపు మూడేళ్లుగా ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. మొదటిరోజు నుండే ‘గేమ్ ఛేంజర్’కు మిక్స్‌డ్ టాక్ లభించింది. చాలామంది అయితే కావాలని దీనిపై నెగిటివ్ రివ్యూలు వైరల్ అయ్యేలా చేశారు. అలా ఈ సినిమా యావరేజ్ హిట్‌గా థియేటర్లలో రన్ పూర్తి చేసుకొని ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అందుకే ‘గేమ్ ఛేంజర్’ తర్వాత బుచ్చిబాబుతో తెరకెక్కనున్న ‘ఆర్సీ 16’పై ఫోకస్ పెట్టాడు చరణ్. తాజాగా సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్ లుక్స్ చూస్తుంటే ‘ఆర్సీ 16’పై మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
Also Read: ఏం చేయలేకపోయాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను.. సల్మాన్ ఖాన్ ఆవేదన
ఒక్క హిట్ కావాలి
సాయి ధరమ్ తేజ్ చివరిగా ‘విరూపాక్ష’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతోనే తన తరువాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు సాయి ధరమ్ తేజ్. కానీ అందరు యంగ్ మెగా హీరోల్లో వరుణ్ తేజ్ పరిస్థితి కాస్త దారుణంగానే ఉంది. తను హీరోగా నటించిన సినిమాలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులనే మూటగట్టుకుంటున్నాయి. ఏ జోనర్ సినిమా అయినా కూడా వరుణ్ తేజ్‌కు హిట్ ఇవ్వలేకపోతున్నాయి. అందుకే తన కమ్ బ్యాక్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
♥️♥️♥️#RamCharan #SaiDharamTej #VarunTej pic.twitter.com/5cZIbm2kWR
— Praveen (@AlwaysPraveen7) February 9, 2025