Welfare of Gig Workers: గిగ్ వర్కర్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జొమాటో, జెప్టో, స్విగ్గీ, ఉబర్, ఓలా, రాపిడో లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ కింద పని చేస్తున్న వారికి సామాజిక భద్రత కల్పించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్ల కోసం రాజస్థాన్ ప్రభుత్వం అయితే ప్రత్యేక చట్టమే తీసుకొచ్చింది. వీరి కోసం లేబర్ కోర్టు, ఇతర రిఫామ్స్ అమలు చేయాలని భావిస్తోంది. కార్మిక-ఉపాధి కల్పన శాఖల ద్వారా వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని అనుకుంటుంది. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ దేశంలో ఉనన అన్ని రాష్ట్రాల కార్మిక శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్, కార్మిక శాఖ అదనపు కమిషనర్ ఈ. గంగాధర్ హాజరయ్యారు.
దేశంలో రోజురోజుకీ గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో గిగ్ వర్కర్ల సంఖ్య పెరగడాన్ని కేంద్రం గుర్తించింది. దేశంలో 65 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 3 కోట్లకు పైగా చేరుకునే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో వీరి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. అందువల్లే వారికి లేబర్ కోర్టు నిబంధనలు, రీఫామ్స్ ను అమలు చేయాలని పలు రాష్ర్టాలకు కేంద్రం సిఫార్సు చేసింది. మామూలుగా పలు రంగాలల్లో కార్మికులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు పని చేస్తుంటారు. కానీ జొమాటో, స్విగ్గీ, ఓలా, రాపిడో లాంటి సంస్థల్లో పని చేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేకమైన పని వేళలు లేవని కేంద్రం గుర్తించింది.
అయితే, తెలంగాణ సర్కార్ గిగ్ వర్కర్ల సమస్యలను గుర్తించింది. వారిని కార్మికులుగా గుర్తిస్తూ.. ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ బీమా కింద రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగ్గురు గిగ్ వర్కర్లు మృతిచెందారు. వారికి అండగా నిలుస్తాని.. ఆర్థిక భరోసా కల్పిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. గిగ్ వర్కర్ల సంక్షేమంలో తెలంగాణ గవర్నమెంట్ మంచి నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్రం కొనయాడింది. తెలంగాణ రాష్ట్రం లాగానే ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కేందరం పేర్కొంది. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించాలని కేంద్రం, రాష్ర్ట్రాలకు సిఫార్సు చేసింది.
Also Read: Intermediate English Paper: అలెర్ట్.. ఇంటర్ ఇంగ్లిష్ పేపర్‌లో మార్పులు.. ఆందోళనలో స్టూడెంట్స్..
గిగ్ అండ్ ప్లాట్ ఫామ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఐదు రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పలించింది. దీనికి రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటక, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాలతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ, రాజస్థాన్ కార్మిక శాఖలనే లీడ్ గా తీసుకోవాలని మిగితా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. త్వరలో నిర్వహించనున్న మరో సమావేశంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి ఈ ఐదు రాష్ట్రాలు సూచనలు-సలహాలు ఇవ్వాలని కేంద్రం కోరింది