E-Paper
Advertisement

సౌత్ సెంట్రల్ రైల్వేలో 2801 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు, పూర్తి వివరాలివే

సౌత్ సెంట్రల్ రైల్వేలో 2801 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు, పూర్తి వివరాలివే
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. సౌత్ సెంట్రల్ రైల్వేలో (సికింద్రాబాద్ జోన్) భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.. టెన్త్, ఐటీఐ పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే రైల్వేలో ఇతర ఉద్యోగాలకు కాంపిటేషన్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది.

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. అర్హత ఉన్న వారందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్ట్ వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, దరఖాస్తు ప్రక్రియ, తదితర వాటి గురించి స్పష్టం తెలుసుకుందాం.

Advertisement

సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ లో యాక్ట్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 2801

Advertisement

పోస్ట్ పేరు: యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు

వెకెన్సీ వివరాలు: వివిధ విభాగాల్లో వెకెన్సీలు ఉన్నాయి. ఏసీ మెకానిక్, కార్పెంటర్, కోపా, డీజిల్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిస్ట్, ఎంఎంటీఎమ్, మోటార్ మెకానిక్ వెహికిల్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు.. (టెన్త్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి). ఈ అర్హత ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

వయస్సు: 2026 ఏప్రిల్ 11 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: టెన్త్, ఐటీఐ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

అప్లికేషన్ ఫీజు: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. మహిళా, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు.

అఫీషియల్ వెబ్ సైట్: https://scr.indianrailways.gov.in

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేది: 2026 మార్చి 12

దరఖాస్తు చివరి తేది: 2026 ఏప్రిల్ 11

నోట్: దరఖాస్తుకు ఇంకా 9 రోజులే..

ALSO READ: Best Govt Scheme: మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. పూర్తి వివరాలు ఇలా!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×