Rashmika Mandanna: ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఇండియన్స్ సినిమా అయిపోయింది. తెలుగు సినిమాల్లో చాలామంది వేరే లాంగ్వేజ్ కు చెందిన నటులు కనిపిస్తూ ఉంటారు. అలానే చాలామంది తెలుగు నటులు మిగతా భాషలో వచ్చే సినిమాల్లో కూడా నటిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి. అందుకే ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్క నటుడిని తీసుకువచ్చి సినిమాలో ప్లాన్ చేస్తుంటున్నారు దర్శక నిర్మాతలు.
అయితే మిగతా ఇండస్ట్రీలో ఆ నటులకు ఇవ్వని రెమ్యూనరేషన్ కేవలం తెలుగు నిర్మాతలు మాత్రమే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇస్తున్నారు అని చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. అది కూడా నిజమే అని కొంతమంది భావిస్తుంటారు. అయితే వీటన్నిటికీ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు నిర్మాత ధీరజ్ మొగిలినేని.
ఇతర భాషలకు సంబంధించిన నటులకు తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే మాట వాస్తవమే, కానీ మీరు అనుకున్నట్లు డబల్ రెమ్యూనరేషన్ అయితే ఉండదు. అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాకపోయినా కూడా ఒక సినిమా ఓటీటీ లో విడుదలైనప్పుడు కొన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగా మిగతా భాషలో చూసినప్పుడు వాళ్లకి సొంత సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. అందుకోసమే చాలామంది నటులను వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేవలం ఇతర భాషల నుంచి వచ్చిన నటులు తెలుగులో పనిచేయడం మాత్రమే కాకుండా, మన తెలుగు వాళ్ళు కూడా ఇతర లాంగ్వేజ్ కి వెళ్లి సినిమాలు చేస్తున్నారు. అజయ్ ఘోష్, సునీల్ వంటి ఎంతోమంది నటులు ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.
ఇక తెలుగులో కూడా చాలామంది తమిళ నటులు కనిపిస్తూ ఉంటారు. వీటివి గణేష్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. బీస్ట్ సినిమాలో ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అనే డైలాగ్ పాపులర్ అవడంతో సోషల్ మీడియా రీల్స్ లో కూడా విపరీతంగా వైరల్ అయ్యాడు గణేష్. అందుకోసమే తెలుగు దర్శక నిర్మాతలు కూడా తనను తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన అక్కడ మిస్ అయింది.
Also Read : Prabhas: ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న ప్రభాస్? నెక్స్ట్ డెసిషన్ ఏంటి?