BANK OF MAHARASHTRA: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త… బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రంలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న వారికి ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకనే ప్రయత్నం చేద్దాం.
నోట్: రేపే లాస్ట్ డేట్
పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BANK OF MAHARASHTRA) శాశ్వత ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రంలో ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, సీఐఎస్‌ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్, లీగల్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ అకౌంట్స్, క్రెడిట్, సీఏ, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు వెకెన్సీలు..
డిప్యూటీ జనరల్/అసిస్టెంట్ జనరల్/ఛీఫ్/సీనియర్ మేనేజర్/మేనేజర్(స్కేల్- 2, 3, 4, 5, 6): 350
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 30
వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు వయస్సు 25 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు స్కేల్-2, 3, 4, 5, 6 పోస్టులకు రూ.64,820 – రూ.1,40,500 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 118 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ: DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!