Kerala: కేరళలోని విషాద ఘటన చోటుచేసుకుంది. పునాలూర్‌కు చెందిన శాలిని, ఇషాక్‌కు ఇటీవల వివాహం జరిగింది. వాళ్లకి ఇద్దరు కొడుకులు. అందులో ఒక కుమారుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. శాలిని, ఇషాక్ మధ్య గొడవలు జరగడంతో శాలిని వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లింది. ఇషాక్ ఉపాధి పని కోసం గల్ఫ్‌కి వెళ్లాడు. శాలిని ఓ ప్రైవేట్ పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. అంతే కాకుండా రాజకీయ పార్టీలో కూడా పనిచేస్తుంది. సోమవారం ఇషాక్ గల్ఫ్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. తన మాట వినడం లేదనే కోపంలో ఉన్నాడు. అదే సమయంలో స్నానం కి వెళుతున్న శాలిని పై కత్తితో దాడి చేశాడు. పలుచోట్ల గాయాలు కావడంతో శాలిని అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తన భార్యను చంపిన విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రకటించాడు. ఆ తర్వాత నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.