DSSSB: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త… ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షణ్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న వారికి ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకనే ప్రయత్నం చేద్దాం.
నోట్: రేపే లాస్ట్ డేట్
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో 334 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 24న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 334
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో కోర్ట్ అటెండెంట్, కోర్ట్ అటెండెంట్ (ఎస్), కోర్ట్ అటెండెంట్ (ఎల్), రూమ్ అటెండెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
కోర్టు అటెండెంట్: 295 పోస్టు్లు
కోర్ట్ అటెండెంట్ (ఎస్): 22 పోస్టులు
కోర్ట్ అటెండెంట్ (ఎల్): 1 పోస్టు
రూమ్ అటెండెంట్ (హెచ్): 13 పోస్టులు
సెక్యూరిటీ అటెండెంట్: 3 పోస్టులు
దరఖాస్తు ఫీజు: అర్హత ఉన్న వారు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 26
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 24
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసైన వారు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/
అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మంచి వేతనం ఉంటుంది. అప్లై చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 334
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 24
ALSO READ: EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా