RRC Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశమనే చెప్పవచ్చు. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్, స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC Northern Railway).. స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 38 గ్రూప్-డి పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే పైసలే పైసల్ భయ్యా.. ఈ అర్హత ఉంటే ఇప్పుడే..?
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 38
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో 38 గ్రూప్-డీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 9
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 9
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. స్పోర్ట్స్ లో ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అబ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరీఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.18,000 నుంచి 56,900 జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్,/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/ఈబీసీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.250 పే చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://rrcnr.org/
అప్లికేషన్ లింక్: https://rrcnr.net.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.18,000 నుంచి 56,900 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: SECR Recruitment: టెన్త్, ఐటీఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. పూర్తి వివరాలివే..
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 38
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 9
జీతం: రూ.18,000 నుంచి రూ.56,900 వరకు వేతనం ఉంటుంది.