Electricity Bill Save Tips: సమ్మర్ సీజన్ మొదలైంది. ప్రతి ఇంట్లో ఎడతెరిపి లేకుండా ఫ్యాన్లు, ఏసీలు పని చేయాల్సిందే. లేకుంటే ఉక్కపోతలు తప్పవు. అందుకే ప్రతి ఇంటిలో ఫ్యాన్ ల, ఏసీల పనిపట్టారు ప్రజలు. అయితే నెలకు వచ్చే కరెంట్ బిల్ చూసి మాత్రం గుండె గుభేల్ మనాల్సిందే. సామాన్య ప్రజానీకం పరిస్థితి అయితే ఇంకాస్త బిల్లును చూసి భోరుమనాల్సిందే. అందుకే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు, సమ్మర్ లో అధిక కరెంట్ బిల్లుల నుండి ఉపశమనం లభించడం ఖాయమని విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇంతకు ఆ విద్యుత్ ఆదా, కరెంట్ బిల్ ఆదా టిప్స్ ఏమిటో తెలుసుకుందాం.
అసలే ఎండలు భగభగమంటున్నాయి. వృద్దులు, చిన్నారులు బయటకు రాలేని పరిస్థితి. ఉదయం, సాయంత్రం మినహా మిగిలిన సమయాల్లో ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఈ సమయంలో ఇంటి పట్టున ఉండే వారు తప్పక వేడిగాలుల నుండి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లను, ఏసీలను వినియోగిస్తారు. కొద్దిక్షణాలు విద్యుత్ సరఫరా ఆగిందా.. ఇక అంతే గృహాలలో ఉండలేని పరిస్థితి. ప్రధానంగా శిశువులు ఉన్న గృహాలలో కరెంట్ లేకుంటే శిశువుల ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మర్ సీజన్ కాస్త కరెంట్ వినియోగం అధికంగా ఉంటుంది. అయితే నెలకు వచ్చే విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన ఉన్నా, తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు, విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ బిల్లుల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది.
❂ ఆ చిట్కాలు ఇవే..
❄ సీలింగ్ ఫ్యాన్లు, బాక్స్ ఫ్యాన్లు లేదా పెడెస్టల్ ఫ్యాన్లు గాలిని బాగా అందిస్తాయి.
❄ AC ఉష్ణోగ్రతను బట్టి అడ్జస్ట్ చేయాలి. మీ ఎయిర్ కండిషనర్‌ను 24°C (75°F) లేదా అంతకంటే ఎక్కువకు సెట్ చేయాలి
❄ AC ఉపయోగంలో లేనప్పుడు లేదా గది నుండి బయటకు వెళ్ళేటప్పుడు ACలను తప్పక ఆపివేయాలి
❄ LED బల్బులు చాలా తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. అందుకే ప్రతి ఇంట్లో LED బల్బులు చాలా అవసరం
❄ ఉపయోగంలో లేనప్పుడు లైట్లను ఆర్పివేయాలి
❄ ఛార్జర్‌లను అన్‌ప్లగ్ చేయాలి
❄ ఉపయోగంలో లేనప్పుడు ఫోన్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లను అన్‌ప్లగ్ చేయాలి
❄ కర్టెన్లు, బ్లైండ్‌లను ఉపయోగించాలి
❄ సూర్యరశ్మి ఇంటిలోనికి రాకుండా, ఇంటిలో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో కర్టెన్లు, బ్లైండ్‌లను మూసివేయాలి
❄ చల్లని నీటిలో బట్టలు ఉతకడం వల్ల గణనీయంగా విద్యుత్ ను ఆదా చేయవచ్చు
❄ బట్టల డ్రైయర్‌ని ఉపయోగించే బదులు, మీ బట్టలను బయట ఆరవేయడం మంచిది
❂ ఇవి తప్పక పాటించండి
❄ ఇంటిలో చల్లబడిన గాలి బయటకు రాకుండా తలుపులు, కిటికీలు, నాళాల చుట్టూ ఉన్న ఏవైనా గాలి లీక్‌లను మూసివేయాలి
❄ మీ ఎయిర్ కండిషనర్ ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
❄ నీడను అందించడానికి, వేడి పెరుగుదలను తగ్గించడానికి మొక్కలు నాటండి
❄ పగటిపూట బయటి కాంతి లోపలికి అనుమతించడానికి కర్టెన్లు, బ్లైండ్‌లను తెరవాలి
❄ అనవసరంగా విద్యుత్ వినియోగం చేయవద్దు
❄ అలాగే ఇంటి పైకప్పు పైన కూలింగ్ పెయింట్ వేయించిన యెడల, ఇంటిల్లి పాదికి కాస్త చల్లదనం ఉండే అవకాశం ఉంది
Also Read: Electricity From Plants : మీ గార్డెన్‌లోని మొక్కలతో కరెంట్ పొందొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇలాంటి టిప్స్ పాటించడం ద్వారా ప్రతి ఇంట్లో విద్యుత్ ఆదా సాధ్యమవుతుందని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. అసలే సమ్మర్ సీజన్ కాబట్టి గృహాలలో ఉన్నవారు ఈ టిప్స్ పాటిస్తే కాస్త అధిక కరెంట్ బిల్ నుండి ఉపశమనం లభిస్తుందట. మరి మీరు ఈ టిప్స్ పాటించండి.. విద్యుత్ ఆదా చేయండి!