BEL Recruitment: నిరుద్యోగుల అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ, బీఆర్క్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశమనే చెప్పవచ్చు. ప్రముఖ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పర్మనెంట్, ఫిక్స్ డ్ టర్మ్ ప్రాతిపదికన కింద పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.30,000 వరకు జీతం.. జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్ భయ్యా..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
డిప్యూటీ మేనేజర్: 2 ఉద్యోగాలు
సీనియర్ ఇంజినీర్: 13 ఉద్యోగాలు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 16
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ, బీఆర్క్ పాస్ అవ్వడంతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. డిప్యూటర్ మేనేజర్ ఉద్యోగానికి 36 ఏళ్ల వయస్సు మించకుండా ఉండాలి. సీనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి 32 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు వేతనం ఉంటుంది. సీనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: పర్మనెంట్ పోస్టులకు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్ డ్ టర్మ్ పోస్టులకు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఉద్యోగానికి అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటిడ్, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామాకి పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/
అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది.డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు వేతనం ఉంటుంది. సీనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం ఉంటుంది.
ALSO READ: AAI Recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం.. మరి ఇంకెందుకు ఆలస్యం..
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 16