Bank of Baroda Recruitment: నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో నిరుద్యోగులు శుభవార్త చెప్పింది. 4000 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 4000
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెకెన్సీలు ఉన్నాయి. ఏపీలో 59 పోస్టులు, తెలంగాణలో 193 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. అత్యధికంగా గుజరాత్ లో 573 పోస్టులు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 558 పోస్టులు, కర్నాటక రాష్ట్రంలో 537 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ALSO READ: BECIL Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 407 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.79,000..
తెలంగాణ: 193 పోస్టులు
ఏపీ: 59 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో 10, ఈస్ట్ గోదావరి జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 10, విశాఖపట్నం జిల్లాలో 10 పోస్టులు, వెస్ట్ గోదావరి జిల్లాలో 9 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
తెలంగాణలో హైదరాబాద్ 150, రంగారెడ్డిలో 21, మేడ్చల్ లో 15, నిజామాబాద్ లో 7 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
కేటగిరి వారీగా పోస్టులు..
ఎస్సీ: 602 పోస్టులు
ఎస్టీ: 314 పోస్టులు
ఓబీసీ: 980 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 391 పోస్టులు
యూఆర్: 1713 పోస్టులు
*ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 11
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
వయస్సు: కనిష్ట వయస్సు 20 ఏళ్లు, గరిష్ట వయస్సు 28 ఏళ్లు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
-పరీక్షలో జనరల్ అవెర్నెస్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషల సమయం ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ లో పరీక్ష ఉంటుంది.
-ఉద్యోగం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాది కాలం పాటు స్టైఫండ్ ఇస్తారు. మెట్రో అర్బన్ బ్రాంచెస్ లో నెలకు రూ.15000 స్టైఫండ్, రూరల్/ సెమి అర్బన్ రూరల్ లో నెలకు రూ.12000 స్టైఫండ్ ఇస్తారు.
*ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 12 నెలల శిక్షణ కాలం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Group-2 Mains: గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదాపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ క్లారిటీ..
ముఖ్యమైనవి:
మొత్తం పోస్టుల సంఖ్య: 4000(ఏపీ: 59, తెలంగాణ: 193)
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 11