Divvala Madhuri on Nara Lokesh: దివ్వెల మాధురి అంటే తెలియని వారుండరు. ఆమె పక్కా వైసీపీ మహిళా నేతగా పరిచయం. అంతేకాకుండా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితురాలు. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఈ మాటలు అన్నది కూడా వారే. ఇటీవల లవర్స్ డేను ఈ జంట జరుపుకున్నారు. అయితే నిత్యం ఏదొక రూపంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురి వార్తల్లో ఉండాల్సిందే. తాజాగా దివ్వెల మాధురి ఒక్క మాటతో సంచలనం సృష్టించారు. దివ్వెల మాధురి ఏకంగా లోకేష్ కు జై కొట్టారు. ఇక అసలు విషయంలోకి వెళితే..
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీకి చెందిన నేత. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉన్నారు. అయితే దువ్వాడ కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి.. ఔను నిజమే.. కష్టాల్లో ఉంటే అండగా ఉండడం తప్పా అంటూ మాధురి ప్రశ్నించారు. ఆ తర్వాత వీరి వ్యవహారం పలు కీలక మలుపులు తిరిగింది. అంతవరకు ఓకేగానీ, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో మాత్రం తాము పెళ్లికి రెడీ అంటూ మాధురి అసలు విషయం చెప్పేశారు. తమకు గల న్యాయపరమైన సమస్యలు తొలగిన వెంటనే తమ వివాహం జరుగుతుందని, అందరినీ తప్పక ఆహ్వానిస్తామన్నారు.
ఇలా వీరిద్దరూ నాటి నుండి నేటి వరకు వార్తల్లో ఉండాల్సిందే. స్వతహాగా సాంప్రదాయ నృత్యకారిణిగా గుర్తింపు పొందిన మాధురి వైసీపీలో నేతగా ఎదిగారు. అక్కడ ఏర్పడ్డ పరిచయమే దువ్వాడతో మాధురిని జత కలిసేలా చేసిందని ప్రచారం. గత ఎన్నికల్లో దువ్వాడ గెలుపు కోసం దివ్వెల మాధురి ప్రత్యేక టీం ను కూడా రంగంలోకి దించారు. తన అభిమాన నేత, మాజీ సీఎం జగన్ అంటే తనకు ఎంతో గౌరవమని మాధురి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
అలా వైసీపీలో మహిళా నేతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మాధురి ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసిన సమయంలో మాధురి తన వాణి వినిపించారు. ఓ వైపు పార్టీపై ఉన్న అభిమానం, మరోవైపు దువ్వాడతో అనుబంధం కొనసాగిస్తున్న మాధురికి యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది. త్వరలో ఈ జంట వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు.
అయితే వైసీపీ పార్టీ నేతగా గుర్తింపు పొందిన మాధురి, ఓ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ కి జై కొట్టారు. ఔను ఇది నిజమే. ఇది పాత వీడియోనా, లేక లేటెస్ట్ వీడియోనా తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో యాంకర్.. టీడీపీలో స్వీటెస్ట్ పర్సన్ అంటే ఎవరని మాధురిని ప్రశ్నిస్తారు. ఆ మాటకు మాధురి సమాధానమిస్తూ.. నారా లోకేష్ స్వీటెస్ట్ పర్సన్ అని, వెరీ ఇంటెలిజెంట్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేసే గుణాలు ఉన్న వ్యక్తిగా లోకేష్ ను తాను గౌరవిస్తానన్నారు.
Also Read: AP Electricity Charges: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు
రాజకీయాలకు అతీతంగా లోకేష్ అంటే తనకు అభిమానమని మాధురి అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దటీజ్ లోకేష్ అంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాధురి, ఏకంగా లోకేష్ జై కొట్టినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేలా మాట్లాడడంలో మాధురి తర్వాతే ఎవరైనా అంటూ మరికొందరు రిప్లై ఇస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కి మాధురి సంబర పడతారా లేక ఖండిస్తారో వేచిచూడాలి.