Group-2 Mains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్-2 అభ్యర్థులు అలెర్ట్. గ్రూప్-2 మెయిన్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడేది లేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ క్లారిటీ ఇచ్చారు. వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ నెల 23న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నట్లు చైర్మన్ తెలిపారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరు అవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 23 నిర్వహించే ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్ రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ అనురాధ తెలిపారు. గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ఛైర్మన్ అధికారులతో కలిసి సమీక్షించారు. మొత్తం 13 జిల్లా కేంద్రాల్లో 175 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 92,250 మంది హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ ముందు పరీక్షల ఏర్పాటు గురించి వివరించారు. ఎగ్జామ్స్ ఎలా కండక్ట చేయాలనే దానిపై ఒక బుక్ లెట్ ను అన్ని పరీక్షా కేంద్రాలకు పంపామని.. ఆ సూచనలు అన్నీ లైజన్ అఫీషియల్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: BECIL Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 407 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.79,000..
సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలపై పోస్టులు పెడుతున్నారని.. ఎగ్జామ్స్ వాయిదా పడతాయనే దుష్ప్రచారంపై నమ్మొద్దని చెప్పారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. సోషల్ మీడియాలో కానీ మరెక్కడా అయినా కానీ అబద్దపు ప్రచారాలు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, ఆశాఖ కమిషనర్ కృతికా శుక్ల, సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐఎన్ మూర్తి, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, ఇతర అధికారులు పాల్టొన్నారు.