BigTV English
Advertisement

Mutton Gravy: మటన్ గ్రేవీని మెంతికూరతో చేసి చూడండి, ఎంత తిన్నా తనివి తీరదు.. రెసిపి ఇదిగో

Mutton Gravy: మటన్ గ్రేవీని మెంతికూరతో చేసి చూడండి, ఎంత తిన్నా తనివి తీరదు.. రెసిపి ఇదిగో

మటన్ కూర ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి కొత్తగా చేసి చూడండి. ఇక్కడ మేము మెంతికూర మటన్ కూర రెసిపీ ఇచ్చాము. దీన్ని సాధారణ అన్నంలో కలుపుకుని తిన్నాలేదా పులావ్, బిర్యానీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతికూర మటన్ గ్రేవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా ఇగురు టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేసుకున్నారంటే మీరు దీనికి అభిమానులు అయిపోవడం ఖాయం.


మెంతికూర మటన్ గ్రేవీకి కావలసిన పదార్థాలు
మటన్ – అరకిలో
మెంతికూర తరుగు – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – మూడు స్పూన్లు
టమోటో – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పసుపు – అర స్పూను
కొబ్బరి పాలు – పావు కప్పు
గరం మసాలా – అర స్పూను
ధనియాల పొడి – అర స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా

మెంతికూర మటన్ గ్రేవీ రెసిపీ
⦿ మెంతికూరను ఏరి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ మటన్ ముక్కలను కూడా శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో ఉల్లిపాయల తరుగు వేసి అవి రంగు మారే వరకు వేయించుకోవాలి.
⦿ తర్వాత పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలపాలి.
⦿ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటో ముక్కలు, మెంతికూర వేసి దగ్గరగా అయ్యేవరకు వేయించుకోవాలి.
⦿ ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
⦿ రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.
⦿ మెంతికూర పచ్చివాసన పోయేవరకు చిన్న మంట మీద వేయించుకోవాలి.
⦿ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
⦿ కొబ్బరిపాలను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1/2 గ్లాసు నీటిని పోసి కుక్కర్ పైన మూత పెట్టాలి.
⦿ ఐదు ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లగా అయ్యాక మూత తీయాలి.
⦿ అది పులుసులాగా అనిపిస్తే మళ్లీ స్టవ్ వెలిగించి అది దగ్గరగా గ్రేవీ లాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
⦿ చివర్లో కొత్తిమీర తరుగు, కసూరి మేతి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
⦿ అంతే మెంతికూర మటన్ గ్రేవీ సిద్దం అయిపోయింది.
⦿ ఇది వండుతున్నప్పుడే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది.


Also Read: కొబ్బరి నూనెలో ఈ 3 కలిపి వాడితే.. జుట్టు అస్సలు రాలదు

మెంతికూర మటన్ గ్రేవీకి జోడిగా బిర్యానీ, పులావ్, చపాతీ, రోటీ, వైట్ రైస్ ఏదైనా బాగుంటుంది. ఒక్కసారి మేము చేసిన పద్ధతిలో చేసి చూడండి. ఈ కూర అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇగురు ఎక్కువగా వస్తుంది కాబట్టి అన్నం లో కలుపుకోవడానికి వీలవుతుంది. రోటి, చపాతీలతో కూడా ఈ మటన్ కూర టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే దీన్ని మీరు వదిలిపెట్టలేరు.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×