E-Paper
Advertisement

CISF Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం రూ.81,100

CISF Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు..  జీతం రూ.81,100
Advertisement

CISF Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.  కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌).. స్పోర్ట్స్‌ కోటా కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఎక్స్ పీరియన్స్ ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

స్పోర్ట్స్ కోటాలో సీఐఎస్‌ఎఫ్‌లో 403 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 6వ తేది లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 403

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

వివిధ క్రీడా విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వుషు, త్వైకాడో, కరాటే, పెన్‌కాక్ సిలాట్, ఆర్చరీ, కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఖోఖో, వాలీబాల్‌, సెపక్‌టక్రా, బాస్కెట్‌బాల్, టెన్నిస్‌, బ్యాడ్మింటన్, సైక్లింగ్‌, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ , రెజ్లింగ్, బాడీ బిల్డింగ్‌ క్రీడా విభాగాల్లో ఈ వెకెన్సీలు ఉన్నాయి.

పోస్టులు – ఖాళీలు

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): 403 వెకెన్సీలు

విద్యార్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఎక్స్ పీరియన్స్ ను చూస్తారు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థుల హైట్ 167 సెం.మీ, మహిళా అభ్యర్థులు హైట్: 153 సెం.మీ

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుంది.

రిక్రూట్మెంట్ ప్రాసెస్: ట్రయల్‌ టెస్ట్‌, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025  జూన్ 6

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుంది.

Also Read: AAI Recruitment: డిగ్రీ, బీటెక్‌తో ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా వారం రోజులే..!

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 403

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 6

జీతం: రూ.25,500 నుంచి రూ.81,100

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×