BigTV English

Telangana : లవర్‌తో అక్క పరార్.. చివర్లో చెల్లి ట్విస్ట్..

Telangana : లవర్‌తో అక్క పరార్.. చివర్లో చెల్లి ట్విస్ట్..

Telangana : వారి కష్టం ఎవరికీ రావొద్దు. ఒక సమస్య నుంచి బయటపడుదామంటే మరో ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారు. కుటుంబ పరువు కాపాడుకోవడం చేసిన పని.. మరింత పరువు పోయేలా చేసింది. అక్కా, చెల్లి ఇద్దరి ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. మొత్తంగా ఆ ఫ్యామిలీకి ఇప్పుడు తలెత్తుకోకుండా అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


పెళ్లికూతురు జంప్..

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం. ఓ ఇంట్లో పెళ్లి వేడుక. 15 రోజుల క్రితమే హుస్నాబాద్‌కు చెందిన మొగిలితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. రేపే వివాహం. టైమ్ తక్కువగా ఉన్నా.. హడావుడిగా పెళ్లి పనులన్నీ పూర్తి చేశారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధువులంతా వచ్చారు. ఇళ్లంతా పెళ్లి కళతో సందడిగా ఉంది. అంతలోనే షాకింగ్ న్యూస్. పెళ్లికూతురు అనిత తన లవర్‌తో జంప్.


అదీ మేటర్. అనిత కొంతకాలంగా ఓ యువకుడితో లవ్‌లో ఉంది. వారి ప్రేమ సంగతి ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ల పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదు. బలవంతంగా కూతురుకు మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి అసలేమాత్రం ఇష్టం లేని అనిత.. పెళ్లికి ముందురోజు ప్రియుడితో లేచిపోయింది. కూతురు ఇచ్చిన షాక్‌కు ఆ తల్లిదండ్రులకు మైండ్ బ్లాక్ అయింది.

పరువు కోసం చిన్నారి పెళ్లికూతురు..

తెల్లారితే పెళ్లి. ముందురోజు కూతురు పారిపోవడంతో వివాహం ఆగిపోతుంది.స కుటుంబ పరువంతా పోతుంది.. అని ఆ రోజంతా కుమిలిపోయారు. అవమాన భారంతో కుంగిపోయారు. రాత్రంతా బాగా ఆలోచించారు. తమకు తలవంపులు రాకుండా ఉండాలంటే.. చిన్న కూతురును వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. అదే విషయం పెళ్లికొడుకు తరఫు వాళ్లకు చెబితే ఒప్పుకోలేదు. కాళ్లావేళ్లా పడి బతిమిలాడారు. నచ్చజెప్పారు. వారి బాధ చూడలేక.. చివరాఖరికి పాపం అని పెళ్లికి ఒప్పేసుకున్నారు. హమ్మయ్య.. ఫ్యామిలీ పరువు నిలుస్తుందని ఆ పేరెంట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. పెద్ద కూతురు పారిపోయిందనే బాధ నుంచి తేరుకుని.. చిన్న కూతురును పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. బంధువులకు ఈ విషయం చెప్పకుండా.. గప్‌చుప్‌గా చిన్నకూతురుతో పెళ్లి మండపానికి వచ్చారు. అక్కడే అసలు ట్విస్ట్….

పోలీసుల ఎంట్రీతో ట్విస్ట్

ఆపండి… అంటూ సినిమాలో మాదిరి పోలీసులు కళ్యాణ మండపంలో ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఐసీడీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఆ సీన్ చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఆందోళన చెందారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరు మీరు? పెళ్లి ఎందుకు ఆపుతున్నారు? అని భయంతో అడిగారు పెళ్లి వాళ్లు. అప్పుడు అసలు మేటర్ తెలిపింది. పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని.. పెళ్లికూతురు వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉంటుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె మైనరా కాదా? అని ఎంక్వైరీ చేస్తే మైనరే అని తేలింది. చట్టప్రకారం ఈ పెళ్లి చెల్లదంటూ.. పీటల మీది పెళ్లిని ఆపేశారు పోలీసులు. బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం మైనర్‌కు పెళ్లి చేయడం శిక్షార్హమైన నేరం అంటూ ఖాకీలు తమదైన స్టైల్‌లో హెచ్చరించారు. ఐసీడీఎస్ అధికారులు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. వారితో ఆ పెళ్లి ఆపించేశారు.

Also Read : ఫేమస్ యూట్యూబర్ జ్యోతి అరెస్ట్.. పాక్‌కు ఆర్మీ సీక్రెట్స్..

ఇక కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. పెద్ద కూతురేమో పెళ్లికి ముందురోజు పారిపోయింది. పోనీ చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేద్దామంటూ అదీ జరగలేదు. పోలీసులు వచ్చి హడావుడి చేయడంతో ఊరందరి ముందు పరువంతా పోయిందంటూ తెగ ఏడుస్తున్నారు. బంధువులంతా వారిని ఓదార్చుతున్నారు.

Related News

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

Big Stories

×