BigTV English

OTT Movies : ఓటీటీలో మిస్ చెయ్యకుండా చూడాల్సిన సైకో కిల్లర్ మూవీస్.. ఆ ఒక్కటి స్పెషల్.

OTT Movies : ఓటీటీలో మిస్ చెయ్యకుండా చూడాల్సిన సైకో కిల్లర్ మూవీస్.. ఆ ఒక్కటి స్పెషల్.

OTT Movies : మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. చిన్న స్టోరీ లైన్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఎన్నో ఇప్పుడు ఓటిటిలో కూడా సందడి చేస్తున్నాయి. ఈమధ్య ఇక్కడ రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. కింద చెప్పాలంటే హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు  ఎక్కువగా హిట్ అవుతున్నాయి. అయితే ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ వాంటెడ్ సైకో కిల్లర్ సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఎక్కడ చూడొచ్చునో ఒకసారి చూసేద్దాం..


మలయాళ సైకో కిల్లర్ సినిమాలు ఇవే.. 

గ్రాండ్‌మాస్టర్.. 


గత ఏడాది నుంచి మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన మూవీ గ్రాండ్‌మాస్టర్. ఇందులో అతడు ఐపీఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ పాత్రలో నటించాడు. ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలతో విసిరే సవాలును అతడు ఎలా స్వీకరిస్తాడన్నదే స్టోరీ. ఈ కిల్లర్ హత్య చేసిన ప్రతిసారి వదిలే క్లూస్ జనాలకు మైండ్ బ్లాక్ ఎలా చేస్తున్నాయి. మోహన్ లాల్ ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. ఈ మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు..

అంతాక్షరి.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది.. అయితే ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు మిస్ అవ్వకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీయే. విపిన్ దాస్ డైరెక్ట్ చేశాడు. తన భార్య అయినా, క్రిమినల్స్ అయినా ఎవరితో అయినా అంతాక్షరి ఆడటాన్ని సరదాగా భావించే సీఐ దాస్.. ఈ సీరియల్ కిల్లర్ కేసును ఎలా కనిపెట్టారు అన్నది మూవీ స్టోరీ.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూడొచ్చు..

అంజామ్ పతీరా.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో మూవీ అంజామ్ పతీరా.. సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అయితే మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో యూట్యూబ్ లోనూ ఉంది. పోలీస్ ఆఫీసర్లను లక్ష్యంగా చేసుకొని చంపే ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు అన్నది ఈ మూవీ స్టోరీ. అణువణువునా ట్విస్ట్ లతో అదిరిపోతుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తేనే సినిమా బాగా అర్థం అవుతుంది.. ఇక ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో చూడండి..

ఇవే కాదు ఇలాంటి సస్పెన్స్ కిల్లర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ప్రతి మూవీ సూపర్ హిట్ అవుతుంది. ప్రస్తుతం సమ్మర్ స్పెషల్ గా బోలెడు సినిమాలు ఇండస్ట్రీ నుంచి విడుదల కాబోతున్నాయి..

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×