CBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగులకు అర్హులవుతారు. ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం 4500 భారీ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 23న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ALSO READ: NRSC Jobs: గోల్డెన్ ఛాన్స్.. మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు, లక్ష 77వేల జీతం
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4500
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2021 జనవరి 1 తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జూన్ 7
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 23
ఫీజు చెల్లింపు చివరి తేది: 2025 జూన్ 25
ఎగ్జామ్: జూలై ఫస్ట్ వీక్ లో పరీక్ష ఉండే ఛాన్స్ ఉంది.
వయస్సు: 2025 మే 31 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి. అభ్యర్థులు 1997 మే 31 నుంచి 2005 మే 31 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయస్సు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థుల వయస్సు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: సెలెక్ట్ అయన వారికి రూ.15000 స్టైఫండ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.400 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. మొత్తం 100 అబ్జెక్టివ్ ప్రశ్నలకు ఎగ్జామ్ ఉంటుంది. క్వాంటిటేటివ్, కంప్యూటర్, ఇంగ్లిష్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్ మెంట్, ఇన్సూరెన్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాంతీయ నైపుణ్య పరీక్ష ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్ నెస్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
కీలక అంశాలు:
ట్రైనింగ్ తర్వాత ఉద్యోగ హామీ లేదు.
ఒక అభ్యర్థి ఒకదాని కంటే ఎక్కువ అప్లికేషన్లు వేయవద్దు.
సెలెక్షన్ ప్రాసెస్ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతోంది.
ఎగ్జామ్ లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఎల్లప్పుడూ మెయిల్, మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉంచండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://centralbankofindia.co.in
ALSO READ: AIIMS: ఎయిమ్స్‌లో 220 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ అర్హత ఉంటే చాలు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4500
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 23
స్టైఫండ్: రూ.15,000
ఎగ్జామ్: జూలై ఫస్ట్ వీక్