BigTV English
Advertisement

Pawan Kalyan:తీరని కోరికతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో కూడా సాధ్యపడదంటూ!

Pawan Kalyan:తీరని కోరికతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో కూడా సాధ్యపడదంటూ!

Pawan Kalyan..సాధారణంగా ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే సామాన్యలే కాదు సెలబ్రిటీలు కూడా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి నిత్యం శ్రమిస్తూ ఉంటారు. కానీ ఆ కోరిక తీరదని తెలిస్తే.. ఎవరైనా ఆవైపు అడుగులు వేస్తారా..? కానీ ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం తన కోరిక నెరవేరదు అని తెలిసినా సరే ప్రయత్నాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . తనది తీరని కోరిక అని.. భవిష్యత్తులో కూడా అది సాధ్యపడకపోవచ్చు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ కు ఆ తీరని కోరిక ఏంటో ఇప్పుడు చూద్దాం..


సినిమాల్లో కూడా అది సాధ్యపడకపోవచ్చు – పవన్ కళ్యాణ్

ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో సినిమాలలో ఇప్పటివరకు తాను పోషించిన పాత్రలలో ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? అని ప్రశ్నించారు. దీనికి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలలో పూర్తిస్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కూడా కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజజీవితంలో ఎలా ఉంటానో అదే విధంగా వెండితెరపై కూడా కనిపించాలని ఉంది. అయితే అది సినిమాల్లో సాధ్యపడకపోవచ్చు. అలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు”అంటూ తన మనసులో కోరికను చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికైతే తనది ఇది ఒక తీరని కోరిక అని, ఇక ఇలాంటి కోరిక భవిష్యత్తులో.. అందులోనూ సినిమాలలో సాధ్యపడదు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.


also read: Bollywood: మూఢనమ్మకాలకి పోయి కెరీర్నే నాశనం చేసుకున్న స్టార్ హీరో!

పవన్ కళ్యాణ్ సినిమాలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna)దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 14 సార్లు వాయిదా పడి వాయిదాలలో కూడా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. ఇక అదిగో ఇదిగో అంటున్నారు. సినిమా థియేటర్లలో విడుదల అయ్యే వరకు ప్రేక్షకులు నిర్మాతలు చెబుతున్న డేట్ ని నమ్మలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇక ఇందులో నిధి అగర్వాల్ (Nidhi Agarwal)హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ‘ఓజి’ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా కూడా దాదాపు చివరిదశకు చేరుకుందని సమాచారం. ఇక అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల విడుదలైన ఫోటోలు, వీడియోలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related News

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం

Big Stories

×