AIIMS DELHI: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఎయిమ్స్, న్యూఢిల్లీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఎంబీబీఎస్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, పోస్టులు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ(AIIMS DELHI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 220 జూనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
ALSO READ: NRSC Jobs: గోల్డెన్ ఛాన్స్.. మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు, లక్ష 77వేల జీతం
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 220
ఎయిమ్స్, న్యూఢిల్లీలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యునిటీ మెడిసిన్, సీడీఈఆర్, సీటీవీఎస్, డెర్మటాలజీ, ఈహెచ్‌ఎస్, ఎమర్జెన్సీ మెడిసిన్, ల్యాబ్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూరో రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియార్టీ, పాథాలజీ, రేడియో థెరపీ, రుమటాలజీ, సర్జరీ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ రెసిడెంట్ : 220 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌లో పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 19
దరఖాస్తుకు చివరి తేది: జులై 3
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు రూ.15,600 నుంచి రూ.56,100 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీవేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.15,600 నుంచి రూ.56,100 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: NICL: డిగ్రీతో అద్భుత అవకాశం.. 90వేల జీతంతో ఉద్యోగాలు, మిస్ అవ్వొద్దు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 220
దరఖాస్తుకు చివరి తేది: జులై 3
వేతనం: నెలకు రూ.15,600 నుంచి రూ.56,100 వరకు జీతం ఉంటుంది.