RRB NTPC Graduate Notification: రైల్వేలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. తాజాగా రైల్వే నుంచి 5,810 పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని పలు రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC Graduate) పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసింది.
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు పోస్టులకు డిగ్రీ అర్హతను నిర్ణయించారు. నేటి నుంచి(అక్టోబర్ 21) ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్: 161 పోస్టులు
2. స్టేషన్ మాస్టర్: 615 పోస్టులు
3. గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3416 పోస్టులు
4. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు
5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638 పోస్టులు
6. ట్రాఫిక్ అసిస్టెంట్: 59 పోస్టులు
మొత్తం పోస్టులు-5,810
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్‌లో ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి వచ్చి ఉండాలి.
నియామక ప్రక్రియలో మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), రెండో దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. సీబీటీల్లో నెగిటివ్ మార్కింగ్(1/3 విధానం) ఉంటుంది.
అభ్యర్థులకు 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి అభ్యర్థులకు ఫీజు రూ. 250, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500గా నిర్ణయించారు
Also Read: Bank of Baroda Jobs: మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లక్షకు పైగా జీతం, ఇంకా 10 రోజులే
1. అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ లింక్ పై క్లిక్ చేయండి.
2. హోమ్ పేజీలో ‘RRB NTPC గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి.
4. అభ్యర్థి వివరాలతో అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
5. దరఖాస్తు ఫామ్ నింపి ఫీజు చెల్లించండి.
6. చివరిగా సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి.