దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఇండియన్ రైల్వే జాగ్రత్తలు తీసుకుంటుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇక తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా పండుగ సీజన్ కు అనుగుణంగా స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా తాజాగా కీలక ప్రకటన చేసింది.
పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు, కాచిగూడ-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు గురువారాలు, శుక్రవారాల్లో నడుస్తాయని తెలిపింది.
ఇక ఫెస్టివల్ స్పెషల్ రైళ్లు కాచిగూడ-అనకాపల్లి మధ్య పలు స్టేషన్లలో ఆగేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మల్కాజ్ గిరి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రితో సహా ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లు ఫస్ట్ AC నుంచి జనరల్ సెకండ్ క్లాస్ వరకు వివిధ తరగతులను అందిస్తాయి.
పండుగ సీజన్ లో అక్టోబర్ 7, 8, 16, 17 తేదీలలో చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు కాజీపేట, నాగ్ పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ AC నుంచి స్లీపర్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణీకులకు సేవలు అందిస్తాయి.
Read Also: హైదరాబాద్ లో నాలుగు లైన్ల రైలు మార్గం, అమ్మో అన్ని లాభాలా?
తాజాగా దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా పండుగ ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే నెట్ వర్క్ లో రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ చర్చలు చేపట్టింది. ఇక ఈ పండుగ సీజన్ లో దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లను నడిపించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రయాణీకులు ఈ రైళ్లను ఉపయోగించుకుని ఇబ్బంది లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వైష్ణవ్ సూచించారు.
Read Also: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?