పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు వరదలతో నానా అవస్థలు పడుతున్నారు. కోల్ కతాకు సంబంధించిన వరదల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఈ పాముపై జోరుగా చర్చ జరుగుతోంది. కారణం ఏంటంటే..
ఈ వీడియోలో ఒకపాము వరదల నీటిలో ఈదుకుంటూ వచ్చింది. వస్తూ వస్తూ నోటిలో చేపను పట్టుకుంది. పడిపోకుండా గట్టిగా పట్టుకుని వరద నీటిలో స్విమ్ చేస్తూ ముందుకు వెళ్లిపోయింది. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. నిజానికి బెంగాల్ లో చాలా మంది చేపలను ఎక్కువగా ఇష్టపడుతారు. నూటికి 90 శాత మంది ఇంట్లో చేపలను వండుతారు. అందుకే, వారి సంస్కృతిలో చేపల కూడా ఓ భాగం అయ్యింది. అందుకే, పాము చేపను పట్టుకుని వెల్లడంతో పెద్ద చర్చకు కారణం అయ్యింది. ‘కోల్ కతా వరద ముచ్చట్లు’ అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు.
Read Also: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!
చేపను నోటిలో పట్టుకుని వెళ్తున్న వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది క్రేజీగా స్పందిస్తున్నారు. “ఈ పాము ముమ్మాటికి బెంగాల్ కు చెందినదే. అందులో ఏమాత్రం అనుమానం లేదు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “బెంగాల్ లో మనుషులే కాదు, పాములకు కూడా చేపలను ఇష్టంగా తింటాయి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇది కోల్ కతా టైమ్’ అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇంకా చాలా మంది క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.
కోల్ కతాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కోల్ కతాలో గత 24 గంటల్లో ఏకంగా 251 సెంటీ మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 1986 తర్వాత అత్యధికం వర్షపాతం నమోదలయ్యింది. అంతేకాదు, 137 సంవత్సరాలలో ఒకే రోజు ఆరవ అత్యధిక వర్షపాతం ఇదే. 1978లో అత్యధికంగా 369.6 మిమీ వర్షాతం నమోదయ్యింది. 1888లో 253 మిమీ, 1986లో 259.5 మిమీ వర్షం కురిసింది.
Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?