Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరు. ఈయనకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన, ఆయన సినిమాల ప్రస్తావన వచ్చిన అభిమానులకు పూనకాలు వస్తాయని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కాస్త సినిమాలను తగ్గిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కూడా కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా(OG Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ ఆయన స్వాగ్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రముఖ డి ఓ పి రవి కే చంద్రన్ (Ravi K Chandran)ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఈయన ఎంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ఈ సందర్భంగా రవి కే చంద్రన్ మాట్లాడుతూ.. తాను ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేశానని తెలిపారు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖాన్, సూర్య వంటి ఎంతోమంది హీరోలతో తాను సినిమాలు చేశాను. వీరందరితో పోలిస్తే పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. ఈ హీరోలందరూ ఎంత కష్టపడినా ఒకటే పవన్ కళ్యాణ్ ఊరికే అలా పక్కన నిలబడిన అక్కడ ఆరా ఉంటుందని, పవన్ కళ్యాణ్ ముందు హృతిక్ అయినా, ఏ ఖాన్స్ అయినా దిగదుడుపే అనే రేంజ్ లో రవి కె చంద్రన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందుకే పవన్ కళ్యాణ్ ను బాబులకే బాబు కళ్యాణ్ బాబు అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్…
ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న పవన్ ఇటీవల రాజకీయ వ్యవహారాల కారణంగా సినిమాలను కాస్త తగ్గించారు. రాజకీయాలలోకి రాకముందు ఈయన కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశ పరిచిన ఓజి సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఇక ఈయన కమిట్ అయిన సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Kantara Chapter1: బుధవారమే కాంతార చాప్టర్ 1 ప్రీమియర్.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవ్వదుగా!