Raghava Lawrence : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు అద్భుతమైన పాటలను కొరియోగ్రఫీ చేశారు రాఘవా లారెన్స్. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ అయ్యాడు. నాగార్జున హీరోగా చేసిన మాస్, డాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి.
ప్రభాస్ హీరోగా కూడా రెబల్ అనే సినిమా చేశాడు రాఘవ లారెన్స్. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన కాంచన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకి సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం కాంచన 4 షూటింగ్ దశలో ఉంది.
తన జీవితంలో రాఘవ లారెన్స్ ఇప్పటివరకు ఎన్నో సేవలు చేశారు. అయితే మరోసారి తన సేవ హృదయాన్ని చాటుకున్నారు రాఘవ లారెన్స్. మామూలుగా చాలామంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. కానీ రాఘవ లారెన్స్ చేసిన కన్మణి అన్నదాన విరుండు. ఇంకొంచెం ప్రత్యేకమైనది. దీని గురించి రాఘవ లారెన్స్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.
సాధారణంగా ధనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహార రకాలను అలాంటి ఆహార రకాలను ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ చొరవ ప్రారంభమైంది. ఆహారం ఒక ప్రత్యేకతగా ఉండకూడదు, అది ప్రతి హృదయంలో చిరునవ్వులు తెప్పించే విధంగా ఉండాలి. ఈసారి డౌన్ సిండ్రోమ్ ఉన్న నా సోదరులకు సేవ చేయడం చాలా ప్రత్యేకమైనది.
వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞత మరియు ప్రేమతో నిండిపోయింది. మీ అందరి ఆశీర్వాదాలు మరియు మద్దతుతో, నేను ఇతరులకు సేవ చేస్తూనే ఉంటాను.
Kanmani Annadhana Virundhu
An initiative started with the intent to make food varieties that are usually enjoyed only by the wealthy accessible to people who never come across such food varieties. Food should not be a privilege, it should be a joy that brings smiles to every… pic.twitter.com/JYLkYPhLZX
— Raghava Lawrence (@offl_Lawrence) September 26, 2025
మామూలుగా చాలామంది ఫార్మాలిటీ కు అన్నదానాలు పెడుతుంటారు. కానీ రాఘవ లారెన్స్ మాత్రం ఈ వీడియోలో చూస్తుంటే స్వచ్ఛమైన హృదయంతో అందరినీ పలకరిస్తూ, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, కొంతమందికి తానే స్వయంగా తినిపిస్తూ ఆ వీడియో చూస్తున్న వాళ్లకి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశాడు. సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అని మరోసారి రుజువు చేసుకున్నాడు.
Also Read: Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్, బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్