Hero Dharma Mahesh Shocking Comments: గిస్మత్ మండి, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయేన్సర్ గౌతమి చౌదరి, హీరో ధర్మ మహేష్ వ్యవహారం గురించి తెలిసిందే. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం వేధింపుల నుంచి ప్రస్తుతం కేసు ఎఫైర్, చీటింగ్ ల వరకు వెళ్లింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. యూట్యూబ్, మీడియా ఛానళ్లకు వరుసగా ఇంటర్య్వూలు తన భర్తపై ఆరోపణలు చేస్తుంది గౌతమి చౌదరి. రీతూ చౌదరితో మరెంతో మందితో తన భర్త ధర్మ మహేష్ కు ఎఫైర్స్ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది.
కానీ, ఇప్పటి వరకు ఈ కేసులో ధర్మ మహేష బయటకు రాలేదు. ఇటీవల అతడి తండ్రి బిగ్ టీవీకి ఇంటర్య్వూలో ఇచ్చారు. ఇక నిన్న ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తో ఇంటర్య్వూ తర్వాత ధర్మ మహేష్ మౌనం విడాడు. శుక్రవారం (సెప్టెంబర్ 26) బిగ్ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చాడు. ఎట్టకేలకు ఈ కేసులో పెదవి విప్పిన ధర్మ మహేష్ తన భార్య గౌతమిపై సంచలన ఆరోపణలు చేశారు. నేను క్యారెక్టర్ లెస్ అని చూపిస్తున్న గౌతమి తను అంత నిజాయితీ పరులారా? అంత నిజాయితే ఉంటే.. ఎమ్మెల్యేలతో చాటింగ్ లు ఏంటీ? ఆయన కిస్ ఎమోజీలు ఎందుకు పంపిస్తారు.
తను అంత కరెక్ట్ అయితే బెడ్ రూంలో సీసీ కెమెరాలు పెడుతుందా? అది ఇల్లీగల్ కాదా? సరే తను అంత కరెక్ట్ అని చెప్పుకుంటుంది కదా.. పెళ్లికి ముందే మేమిద్దరం సహాజీనవం చేశాం. గుంటూరులో వన్ టౌన్ దగ్గర ఉండేవాళ్లం. ఆ ఓనర్ కూడా ఇంకా నాకు కాంటాక్ట్ లో ఉన్నాడు. తను ప్రెగ్నెంట్ అయితే.. సరే నేను నీతో ఉంటాను. ప్రెగ్నెంట్ ఉంచుకో అని చెప్పాను. వద్దు పరువు పోతుందని తీయుంచుకుంది. మరీ ఇది పరువు తక్కు విషయం కాదా. తను చేయలేదా తప్పులు. తన బర్త్ డే రోజు ఎవరో కారు ఎక్కి వెళ్లిపోయింది(రాత్రి మళ్లీ ఇంటికి వచ్చింది అది ఒకే).
Also Read: Dharma Mahesh: మౌనం వీడిన హీరో ధర్మ మహేష్.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్..
అలాగే రాత్రిళ్లు సడెన్ గా వెళుతుంది. ఇవన్నింటిని ఓ భర్త తట్టుకోగలడా? ఒక రోజు గౌతమి తాగి.. నా ఫోటో కాల్చింది. గౌతమి నాకు తెలియకుండ సెకండ్ నెంబర్ వాడుతుంది. నెంబర్ అడిగితే నీ ప్రైవసీ నీది.. నా ప్రైవసీ నాది అన్నది. భర్తకు తెలియకుండ సీక్రెట్ గా నెంబర్ వాడతారా? భార్యభర్తలకు సీక్రెట్ ఉంటుందా? అని ధర్మ మహేష్ భార్యపై ప్రతి ఆరోపణలు చేశాడు. జర్నలిస్ట్ మూర్తి నా భార్యకు సపోర్టు ఇవ్వడమేంటో అర్థం కావడం లేదు. నేను విడాకులు కేసు వేశాను.. ఈ విషయంలో మూర్తి కలుగజేసుకోకుండ ఉంటే మంచిది.. అంటూ ధర్మ మహేష్ వ్యాఖ్యానించాడు.