Bigg Boss 9: కొత్త హౌస్ మేట్ గా దివ్యా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలు ఈ గేమ్ గమనించారు కాబట్టి. హౌస్ మేట్స్ కి మీరు ర్యాంక్స్ ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ దివ్యకి చెప్పారు. 13 ప్లేస్ ను ఫ్లోరాకు ఇచ్చింది దివ్య. ఇంట్రాక్షన్ గాని, ఇన్వాల్వ్మెంట్ గాని మీరు చాలా తక్కువ ఉంది. మీ గేమ్ విషయంలో కూడా టు వీక్స్ నుంచి సైన్ అవుతున్నట్టు నేను ఎక్కడా చూడలేదు అంటూ చెప్పింది. లిస్ట్ ఇంపాక్ట్ అనిపించి అందుకే 13 పొజిషన్ లో పెట్టా.
రాము మీరు మనిషి మంచి వాళ్లే, అంతా పర్ఫెక్ట్. లాస్ట్ టైం టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా ఏం చేయకుండా నిల్చోట నాకు నచ్చలేదు. మీరు ప్రతి దాన్ని ఈజీగా గివ్ అప్ చేస్తున్నారు అనిపించి నేను మిమ్మల్ని ఆ పొజిషన్ లో పెట్టాను. అంటూ 12 పొజిషన్ ఇచ్చింది.
కళ్యాణ్ నువ్వు వస్తావు రెండు మూడు డైలాగులు చెప్తావు. రెండు మూడు డైలాగులు నీ వినిపిస్తాయి తర్వాత మళ్లీ కనిపించవు. ఒక టాస్క్ లో గెలవాలి అని నువ్వు అనుకుంటావు. ఆ తరుణంలో పక్క వాడిని కొట్టేసిన చంపేసిన పర్లేదు అనే ఆలోచనలో నువ్వు డిమాన్ పవన్ ఉంటారు. అంటూ 11 పొజిషన్ లో పెట్టింది.
శ్రీజ నీ గురించి సింపుల్ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నీ సెంటెన్స్ కి పుల్ స్టాప్ అనేది ఉండదు. అలానే ఆ సెంటెన్స్ కి పాయింట్ కూడా ఉండదు అనేది నా ఫీలింగ్. నువ్వు గొడవ పంచడానికి ట్రై చేస్తావు గాని దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని ట్రై చేయవు. టాస్క్ లో కూడా ఫస్ట్ వీక్ లో నువ్వు గెలిచిన టాస్క్ విషయానికి వస్తే. వేరే వాళ్ళందరూ మిగతా వాళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి నువ్వు గెలిచావు. వచ్చేసాను కదా ఇంకా అయిపోయింది ఇంకా పని లేదు అన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే నీకు నెంబర్ 10 ఇచ్చాను.
హరీష్ గారు శ్రీజ కు చెప్పిన పాయింట్ మీకు కూడా కొంచెం వర్తిస్తుంది అండి. నేను ముందు చూసిన హరీష్ గారు ఇక్కడ లేరు. మీరు చాలా డల్ గా ఉన్నారు. మీరు ఎక్కడ కనిపించట్లేదు. గేమ్స్ లో కూడా ఏదో ఉన్న అన్నట్లు అనిపించింది అందుకే నెంబర్ నైన్ ఇచ్చాను.
ప్రియా నేను నిన్ను అగ్నిపరీక్షలో కూడా చూశాను అప్పుడు నీకున్న క్లారిటీ ఇప్పుడు నీకు లేదు. వేరే వాళ్ళ మాటలు పట్టుకుని తానా తందానా లాగా అయిపోతున్నావు. ఇప్పుడు ఓనర్స్ గ్రూపులో ఉన్న, టెనెంట్ గ్రూపులో ఉన్న ఆ గ్రూపులో నువ్వు యాక్సెప్ట్ అవ్వడానికి నీ ఒరిజినాలిటీ నువ్వు కోల్పోతున్నావని నాకు అనిపించింది. అందుకే 8th పొజిషన్ ఇచ్చాను.
రీతు టాస్క్ వైస్ నీ స్టాండ్ ఏమైనా అయ్యుండొచ్చు. నువ్వు పర్సనల్ గా ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. నీ కాన్సన్ట్రేషన్ మాత్రం వేరే వాళ్లను అవుట్ చేయడంలో ఉంది. అని అనిపించింది. అందుకే నీకు సెవెంత్ పొజిషన్ ఇచ్చాను.
సుమన్ శెట్టి గారు మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడేస్తారు తర్వాత వెళ్ళిపోతారు మళ్లీ కనిపించరు మీరు. మీ అంతట మీరు అంత ఈనేసిటివ్ తీసుకోరు. టాస్కులో అయితే మాత్రం మీ అంతటి మీరు ఎఫర్ట్ పెడుతున్నారు. వేరే వాళ్ళు తక్కువ కనిపించారు అని చెప్పినట్లు మీరు కూడా తక్కువే కనిపించారు. అందుకే నెంబర్ సిక్స్ ఇచ్చాను.
తనుజ నువ్వు టాస్క్ బానే ఆడుతావ్. నీ బిహేవియర్ వెరీ నైస్. కానీ ఒకటి ఏంటంటే నువ్వు చాలా ఈజీగా ఎమోషనల్ అయిపోతావ్. టాస్క్ లో కూడా సపోర్ట్ చేస్తా అంటే తీసుకో. వాళ్ళు చేస్తా అన్నప్పుడు నీకు ప్రాబ్లమ్ ఏంటి? అందుకే నెంబర్ ఫైవ్ ఇచ్చా.
పవన్ ఫోర్త్ ప్లేస్ ఎందుకు ఇచ్చానంటే, ఏదైతే కెప్టెన్సీ టాస్క్ సరిగ్గా అవ్వలేదు అని రద్దు చేశారో మళ్లీ అది ఆడినప్పుడు నువ్వు గెలిచావు. దాన్నిబట్టి నాకు అనిపించింది నువ్వు వాడితే నువ్వు గెలుస్తావ్. నామినేషన్స్ గురించి మీరు చెప్పారు కదా నిన్న ఆ ప్లేస్లో రితూ ఉన్నా కూడా నువ్వు శ్రీజని సేవ్ చేసావ్. ఫ్రెండ్ విషయంలో కూడా నీకు ఆ క్లారిటీ ఉంది ఫ్రెండ్ ఫ్రెండే గేమ్ గేమే అని. అందుకే నిన్ను ఫోర్త్ పొజిషన్ లో పెట్టా.
సంజన గారు మీరు గేమ్ బాగా ఆడుతారని మీకు తెలుసు. నాక్కూడా మీ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మైండ్ లో మీరు మాకు ప్రింట్ అయ్యారు. సంజన గారు అనేకు క్యారెక్టర్ ఉంది ఆవిడతో జాగ్రత్తగా ఉండండి అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు అందరినీ గెలుకుతారు అలా చేసినప్పుడు. నేను చూసినప్పుడు నాకు ఎంజాయ్ పా అనిపిస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు..? నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు మీరు.
ఇమ్మానుయేల్ మీ గేమ్ నచ్చింది, మీరు ఎంటర్టైన్ చేస్తారు. మీకు ఆ థింకింగ్ కెపాసిటీ కూడా ఉంది. అందుకే మీకు సెకండ్ పొజిషన్. మొత్తానికి ఫస్ట్ పొజిషన్లో దివ్య దృష్టిలో భరణి ఉన్నారు. టాప్ సెవెన్ లో ఉన్నవాళ్లు కెప్టెన్సీ కోసం అర్హత సాధించారు. కానీ కేవలం ఐదుగురు మాత్రమే కెప్టెన్సీకి పోటీ పడగలరు అని బిగ్ బాస్ నిర్ణయించాడు. ఐదుగురిని కూడా నిర్ణయించే అవకాశాన్ని దివ్యకు అందించారు బిగ్ బాస్.
Also Read: RamCharan 18Yrs Legacy : రామ్ చరణ్ కామన్ డిపి లో అన్ని పాత్రల అరాచకాన్ని చూపించారు