DFCCIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్, ఐటీఐ, డిప్లొమ, సీఎ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DFCCIL) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసకోవచ్చు.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DFCCIL) లో ఎంటీఎస్, ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 22 న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. DFCCIL అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 642
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎంటీఎస్, ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్): 3 పోస్టులు (సీఏ క్వాలిఫికేషన్)
ఎగ్జిక్యూటివ్ (సివిల్): 36 పోస్టులు (సివిల్ విభాగంలో డిప్లొమా)
ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 64 పోస్టులు (ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా)
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికాం): 75 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 464 పోస్టులు(టెన్త్, ఐటీఐ)
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 22
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, సీఏ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంటీస్ పోస్టుకు అయితే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ ద్వారా ఉద్యోగానికి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ : 2025 జూలై ఉంటుంది. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్ డె టెస్ట్ 2025 నవంబర్ లో ఉంటుంది. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ 2026 జనవరి లేదా ఫిబ్రవరి లో నిర్వహిస్తారు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. జూనియర్ మేనేజర్ పోస్టుకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టుకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం ఉంటుంది. మల్టి టాస్కింగ్ పోస్టుకు అయితే నెలకు రూ.16,000 నుంచి 45,000 వరకు వేతనం ఉంటుంది.
వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు.. గరిష్ట వయస్సు 30 ఏళ్లు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://dfccil.com/
అప్లికేషన్ లింక్: https://cdn.digialm.com/
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 642
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 22