TGSRTC Jobs: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 800 కండక్టర్ల పోస్టులను భర్తీ చేసే యోచనలో పడింది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాలని అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పదో తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలోనే రానుంది.
టీజీఎస్‌ఆర్టీసీలో 800 కండక్టర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ రీజియన్‌లో 600 కండక్టర్ పోస్టులు, వరంగల్ రీజియన్‌లో 200 కండక్టర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్‌లో ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి ఛాన్స్. తాత్కాలిక విధానంలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.17,969 జీతం ఉంటుంది. ఓవర్ టైం డ్యూటీ చేసిన వారికి అదనపు జీతభత్యాలు కూడా ఉంటాయి.
గతంలో తెలంగాణ ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల అది లేట్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో ఉద్యోగుల అత్యవసరం ఉన్నందున రెగ్యులర్ నియామకాలు జరిపే వరకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ALSO READ: NIACL: గోల్డెన్ ఛాన్స్ ఇది.. డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్
మొత్తం పోస్టులు: 800 (హైదరాబాద్ రీజియన్: 600, వరంగల్ రీజియన్: 200)
అర్హతలు: టెన్త్ పాసైతే సరిపోతుంది. (అవసరమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి..)
వయస్సు: అఫీషియల్ నోటిఫికేషన్‌లో తెలియనుంది.
జీతం: ఔట్ సోర్సింగ్ కండక్టర్లుగా ఎన్నికైన వారికి రూ.17,969 జీతం ఉంటుంది. ఓవర్ టైం డ్యూటీ చేస్తే అదనపు జీతం కూడా ఇస్తారు. గంటకు రూ.100 చొప్పున జీతం ఉంటుంది.
డ్యూటీ టైమింగ్స్: 8 గంటలు డ్యూటీ ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు తెలంగాణ ఆర్టీసీ డిపోలో కానీ, ఆన్‌లైన్‌లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను నిత్యం సందర్శిస్తూ ఉండండి.
ALSO READ: ECIL Jobs: గోల్డెన్ ఛాన్స్.. ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, రూ.1,40,000 జీతం
అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్‌లో ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి ఛాన్స్. తాత్కాలిక విధానంలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.17,969 జీతం ఉంటుంది. ఓవర్ టైం డ్యూటీ చేసిన వారికి అదనపు జీతభత్యాలు కూడా ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.