Villain Ganesh:అక్కినేని నాగార్జున – అనుష్క శెట్టి(Akkineni Nagarjuna-Anushka Shetty) కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ.. ఢమరుకం (Dhamarukam), డాన్ (Don), కేడి No.1(Kedi No. 1), సూపర్(Super), నమో వెంకటేశాయ (Namo Venkateshaya), రగడ(Ragada) వంటి సినిమాల్లో నటించారు. హీరోయిన్ గా మాత్రమే కాకుండా నాగార్జున నటించిన ఊపిరి,కింగ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాల్లో గెస్ట్ రోల్ కూడా చేసింది అనుష్క. అయితే అలాంటి అనుష్క శెట్టి – నాగార్జున కాంబోలో సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ‘ ఢమరుకం’ మూవీ 2012లో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఢమరుకం విలన్ భార్య ఎవరో తెలుసా?
అయితే ఈ సినిమాలో హీరోగా నాగార్జునకి ఏ మాత్రం తీసిపోని పాత్రలో విలన్ గా గణేష్ వెంకట్రామన్ నటించారు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన గణేష్ వెంకట్రామన్(Ganesh Venkatraman) అచ్చం హీరో కటౌట్ తోనే ఉంటారు.ఈ సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టేశారు. అలాంటి విలన్ పాత్రలో నటించిన గణేష్ వెంకట్రామన్ భార్య ఎవరో తెలుసా? ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
గణేష్ వెంకట్రారమన్ భార్య ఎవరంటే?
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన గణేష్ వెంకట్రామన్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్ వెంకట్రారమన్ భార్య ఎవరో కాదు నటి నిషా కృష్ణన్ (Nisha Krishnan). నిషా తమిళ నటుడు విశాల్ (Vishal) హీరోగా నటించిన ఇంద్రుడు మూవీ(Indrudu Movie) లో నటించింది. నిషా కృష్ణన్ – గణేష్ వెంకట్రామన్ ల వివాహం 2015లో జరిగింది. 2015 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకొని 2015నవంబర్ 22న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ అన్యోన్య దంపతుల ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మొదటి బిడ్డ సమైరా…రెండో బిడ్డ అమర్ లు ఉన్నారు.
నిషా కృష్ణన్ సినిమాలు..
ఇక నిషా కృష్ణన్ సినిమాల విషయానికి వస్తే..ఈమె తమిళ సినిమాలు అలాగే సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా మహాభారతం(Maha Bharatham) టీవీ సీరియల్ లో ద్రౌపది పాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక కేవలం నటిగా మాత్రమే కాకుండా నిషా కృష్ణన్ పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించి యాంకరింగ్ రంగంలో కూడా అడుగు పెట్టింది. అలా మొదట్లో బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి యాంకరింగ్, సీరియల్స్ లో రాణించి తర్వాత సినిమాల్లోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేసింది. అలా తమిళ,తెలుగు, కన్నడ సినిమాల్లో రాణించే గణేష్ వెంకట్రామన్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
ALSO READ:Kubera: ప్రేక్షకులకు షాక్.. ‘కుబేర’ టికెట్ ధరలు పెంపు!