Sunil Narang: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డైరెక్షన్లో మరికొద్ది గంటలో విడుదల కాబోతున్న సినిమా కుబేర. ఈ సినిమాలో హీరోగా ధనుష్(Dhanush), కీలక పాత్రలో నాగార్జున (Nagarjuna), హీరోయిన్ గా రష్మిక మందన్నా (Rashmika mandanna)లు నటించారు.అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న కుబేర సినిమా(Kubera Movie) గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే.. ఈ సినిమా విషయంలో ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన సునీల్ నారంగ్ గుర్రుగా ఉన్నారని, నిర్మాత.. కుబేర మూవీ తర్వాత పూర్తిగా సినిమాలకే దూరంగా ఉంటానని సన్నిహితులతో చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కుబేర మూవీ విషయంలో నిర్మాత ఎందుకు హర్ట్ అయ్యారు..? ఆయన ఎందుకు సన్నిహితుల దగ్గర సినిమాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు? కుబేర సినిమానే ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ (Sunil Narang)కి చివరి సినిమా కాబోతుందా? అసలు మూవీ యూనిట్ కి, ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ కి మధ్య జరిగిన గొడవేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నిర్మాతను చిత్ర బృందం పక్కనపెట్టిందా?
కుబేర మూవీని అమిగోస్ క్రియేషన్స్(Amigos Creations) పై సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు (Pushkara Ram Mohan Rao)లు నిర్మించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ తో పాటు సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసుకుంది. కానీ సినిమాకి మెయిన్ పిల్లర్ అయినటువంటి ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ కి ఇప్పటివరకు కుబేర మూవీని చూపించలేదట. అయితే సినిమా నిర్మించాలంటే కచ్చితంగా నిర్మాత బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ లేకపోతే సినిమా తెరకెక్కదు. అలాంటిది సినిమాకి మెయిన్ పిల్లర్ అయినటువంటి నిర్మాతకే సినిమా చూపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కుబేర మూవీ విషయంలో అదే జరిగిందట.
కుబేర విషయంలో నిర్మాత హర్ట్..
చిత్ర యూనిట్ కుబేర మూవీని సునీల్ నారంగ్ కి ఇప్పటివరకు చూపించలేదట.మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాని ఇప్పటివరకు సినిమా నిర్మాతకే చూపించలేదు అంటే నిజంగానే ప్రొడ్యూసర్ తో చిత్ర యూనిట్ కి ఏమైనా గొడవలు వచ్చాయా అనే అనుమానాలు తమిళ మీడియా వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు.సినిమాకి కావాల్సిన బడ్జెట్ మొత్తం పెట్టారు.అలాంటిది నిర్మాతకే సినిమా చూపించకపోవడం ఏంటి అని చాలామంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.
ఇదే చివరి సినిమా అంటున్న నిర్మాత సునీల్ నారంగ్
అయితే కుబేర మూవీని సునీల్ నారంగ్ కి ఇప్పటివరకు చూపించకపోవడంతో ఈ విషయంలో సునీల్ నారంగ్ చిత్ర యూనిట్ పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు తన సన్నిహితులతో కుబేర మూవీ తర్వాత తాను మళ్ళీ ఏ సినిమా కూడా నిర్మించబోనని, సినిమా నిర్మాణ రంగానికి గుడ్ బై చెబుతానని చెబుతున్నట్టు కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సునీల్ నారంగ్ కి ఇప్పటి వరకు కుబేర మూవీని ఎందుకు చూపించలేదు అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా..
ఇక సునీల్ నారంగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గానే ఆయన టి.ఎఫ్.సి.సి.(TFCC) కి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 24 గంటల్లోనే రాజీనామా చేయడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.అయితే తాజాగా కుబేర మూవీ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ALSO READ:Villain Ganesh: ఢమరుకం విలన్ భార్య ఓ స్టార్ హీరోయిన్ అని తెలుసా?