E-Paper
Advertisement

Danger zone Jobs: ఏఐ వల్ల ఈ ఉద్యోగాలకు ఎసరు, వీరి జాబ్స్ అంత సేఫ్ కావు

Danger zone Jobs: ఏఐ వల్ల ఈ ఉద్యోగాలకు ఎసరు, వీరి జాబ్స్ అంత సేఫ్ కావు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ఉద్యోగ రంగంలో పెద్ద మార్పులను తీసుకొస్తోంది. ముఖ్యంగా కార్యాలయాల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే వైట్ కాలర్ ఉద్యోగాలపై AI ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. 2026 చివరి నాటికి అనేక ఉద్యోగాల చరిత్ర మారిపోయే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో AI వినియోగం మరింత పెరుగుతుంది. ఇప్పటికే అనేక కంపెనీలు పనులను వేగంగా పూర్తి చేయడం, ఖర్చులను తగ్గించడం కోసం AI టూల్స్ ఉపయోగిస్తున్నాయి. దీంతో మానవ ఉద్యోగులు చేసే కొంత పని ఆటోమేటిక్‌గా పూర్తవుతోంది. ఈ మార్పు కొనసాగితే 2026 నాటికి వైట్ కాలర్ ఉద్యోగాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఇవే

రైటర్స్, ఎడిటర్స్ – కంటెంట్ రాయడం, ప్రూఫ్ రీడింగ్ పనులను AI ఇప్పటికే చేయగలుగుతోంది.

కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు – చాట్‌బాట్లు, వాయిస్ బాట్లు కాల్ సెంటర్ పనులను భర్తీ చేస్తున్నాయి.

డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులు – గణాంకాలను విశ్లేషించడం, రిపోర్టులు తయారు చేయడం ఆటోమేట్ అవుతోంది.

వెబ్ డెవలపర్లు – బేసిక్ కోడింగ్, డిజైన్ పనులు AI సహాయంతో వేగంగా పూర్తవుతున్నాయి.

ట్రాన్స్‌లేటర్లు – భాషా అనువాదాల్లో AI ఖచ్చితత్వం పెరుగుతోంది.

మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు – ట్రెండ్ విశ్లేషణ, డేటా సేకరణ పనులు ఆటోమేట్ అవుతున్నాయి.

అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్లు – డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ప్రకటనల ప్రక్రియను మార్చుతున్నాయి.

పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు – ప్రచార మెటీరియల్ తయారీ వంటి పనులు AI ద్వారా సులభమవుతున్నాయి.

Also read: Success Quotes: వారెన్ బఫెట్ చెప్పిన ఈ విషయాలు పాటిస్తే ధనవంతులవ్వడం ఖాయం

ఎందుకు ఈ ఉద్యోగాలపై ప్రభావం?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒకే విధంగా చేసే ఈ పనులు AI ద్వారా సులభంగా ఆటోమేటిక్ గా అవుతాయి. కంప్యూటర్ ఆధారిత డేటా ప్రాసెసింగ్, టెక్స్ట్ తయారీ, గణాంక విశ్లేషణ వంటి పనుల్లో AI వేగం, ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంపెనీలు ఈ పనుల్లో AIను ఉపయోగించడం ప్రారంభించాయి. AI వల్ల ఈ ఉద్యోగాలు పూర్తిగా మాయం అవుతాయని చెప్పలేమ. AI ఉద్యోగాలను తొలగించదు.. కానీ వాటి స్వభావాన్ని మార్చుతుంది. అంటే ఒక ఉద్యోగంలోని కొన్ని పనులు AI చేస్తుంది, మిగతా పనులు మనుషులు చేయాల్సి వస్తుంది. సృజనాత్మకత, భావోద్వేగాల అవగాహన, క్లిష్ట సమయంలో నిర్ణయాలు తీసుకోవడం, మానవ సంబంధాలు వంటి అంశాలు అవసరమైన పనుల్లో AI పూర్తి స్థాయిలో పనిచేయలేదు. అందువల్ల మానవుల అవసరం ఎప్పటికీ ఉంటుంది.

ఉద్యోగులు ఏమి చేయాలి?
భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్‌లో నిలబడాలంటే నైపుణ్యాలను పెంపుకోవాలి. డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత వంటివి కీలకం అవుతున్నాయి. AI టూల్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. AIను చూసి భయపడకుండా దాన్ని సహాయక సాధనంగా ఉపయోగించుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వారు చెబుతున్నారు.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×