E-Paper
Advertisement

Kadiyam Srihari: కమిషన్ల కోసం కాలేశ్వరం నిర్మాణం.. కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్!

Kadiyam Srihari: కమిషన్ల కోసం కాలేశ్వరం నిర్మాణం..  కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్!
Advertisement

Kadiyam Srihari: కేసీఆర్ తెలంగాణకు ఎలా జాతిపిత అవుతారని.. అలా చెప్పుకోవడానికి సిగ్గుండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. పార్టీ ఫిరాయింపు పై స్పీకర్ వద్ద విచారణ హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. కమిషన్ల కోసమే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి.. తెలంగాణను దివాలా తీయించారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం రకరకాల స్కాములలో ఇరుక్కుపోయిందన్నారు.కుటుంబం అంతా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని 2014 కంటే ముందు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని కడియం సవాల్ చేశారు.

Also Read: AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

అధికారం పోయినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదు 

Advertisement

ప్రజా సమస్యలపై స్పందించని వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని సెటైర్ వేశారు. అధికారం పోయినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదని, మాట తీరు మారలేదన్నారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారని ..ప్రజల్లోకి వచ్చి వారి కష్టాలను పట్టించుకోకుండా, ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకుడు ప్రజా నాయకుడు కాలేడన్నారు.తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడంపైనా కడియం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు

ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. రాజకీయం చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. తెలంగాణ అంటే మీ అయ్యా సొత్తా అని ఘాటుగా ప్రశ్నించి.. బీఆర్ఎస్ నేతలకు షాకిచ్చారు. కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడితే అది తెలంగాణను అవమానించినట్టు ఎలా అవుతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Thriller movie OTT : కూతురి మిస్సింగ్ తో అడవిలో హడలెత్తిపోయే అడ్వెంచర్… ఓటీటీలోకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×