E-Paper
Advertisement

AIATSL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎయిర్ ఇండియాలో 1049 ఉద్యోగాలు

AIATSL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎయిర్ ఇండియాలో 1049 ఉద్యోగాలు
Advertisement

AIATSL Recruitment 2024: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1049 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సీనియర్ లెవల్ పోస్టులకు డిగ్రీతో పాటు ఐదు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.

ఖాళీల సంఖ్య: 1049
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు
1. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 343 పోస్టులు.
అర్హత: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి పట్టు ఉండాలి.
వయో పరిమితి: 33 ఏళ్లు మించకూడదు.
నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు మూడు ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ. 28,605.
2.కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 706 పోస్టులు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల  పని అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ , హిందీ భాషలపై పట్టు ఉండాలి.
వయో పరిమితి: 28 ఏళ్లు మించకూడదు. నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ. 27,450.

Advertisement

Also Read:పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2700 ఉద్యోగాలు.. అర్హతలివే !

దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ,ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు చివరి తేదీ: 14.07.2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×