Amazon Layoff: సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారా.. అయితే మీ జాబ్ పోయినట్టే.. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు అమెజాన్‌లో మరోసారి భారీగా ఉద్యోగులును తీసివేస్తున్నట్లు ప్రకటించారు.. ఎందుకంటే?
అమెజాన్ తన వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. లక్సెంబర్గ్‌లోని తన యూరోపియన్ ప్రధాన కార్యాలయంలో సుమారు 370 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. యూరప్ కార్యకలాపాల్లో ఈ స్థాయిలో భారీగా సిబ్బందిని తగ్గించడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వ్యాపార సామర్థ్యాన్ని పెంచే క్రమంలో భాగంగానే ఈ సర్దుబాట్లు చేస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
అయితే గత కొన్నేళ్లుగా టెక్ రంగంలో వస్తున్న మార్పుల వల్ల అమెజాన్ తన పనితీరును పునర్వ్యవస్థీకరిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా మానవ వనరుల అవసరం తగ్గుతోందని కంపెనీ భావిస్తోంది. ఏఐ వినియోగం పెరగడం వల్ల తక్కువ సిబ్బందితోనే ఎక్కువ ఫలితాలను సాధించవచ్చని, అందుకే అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించడం తప్పనిసరి అవుతోందని అమెజాన్ యాజమాన్యం స్పష్టం చేసింది.
కేవలం లక్సెంబర్గ్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు అమెజాన్ గత అక్టోబర్‌లో ఒక ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా మేనేజర్ల సంఖ్యను తగ్గించి, సంస్థలో నిర్ణయాధికార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని చూస్తోంది. బ్యూరోక్రసీని తగ్గించి, గ్రౌండ్ లెవల్ ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ భారీ లేఆఫ్స్ రీజన్ అని తెలిపారు..
టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల వల్ల అమెజాన్‌ను ఈ కఠిన నిర్ణయాల వైపు నడిపిస్తుంది. ఖర్చులను తగ్గించుకుంటూనే, భవిష్యత్తులో లాభదాయకంగా ఉండటానికి కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే లాభాలు రాని విభాగాలను మూసివేయడం లేదా సిబ్బందిని కుదించడం వంటి చర్యలు చేపడుతోంది. లక్సెంబర్గ్‌లోని ఉద్యోగుల తొలగింపు ఈ వ్యూహాత్మక మార్పుల్లో ఒక భాగం మాత్రమే.
Also Read: పంచాయతీ ఫలితాలు.. బీఆర్ఎస్‌లో గేమ్ మొదలు, హరీష్‌రావు కోసం కొత్త పదవి?
అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం అటు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏఐ కారణంగా ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, తొలగించబడిన ఉద్యోగులకు సంస్థ తరపున అందాల్సిన పరిహారం (Severance packages), ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని, వారికి కొత్త అవకాశాలు వెతుక్కోవడంలో సహాయపడతామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇస్తున్నారు.