E-Paper
Advertisement

YS Jagan : యువతరం భవిష్యత్‌పై దెబ్బకొడుతున్న జగన్.. ఇదిగో సాక్ష్యం!

YS Jagan :  యువతరం భవిష్యత్‌పై దెబ్బకొడుతున్న జగన్.. ఇదిగో సాక్ష్యం!
Advertisement

ఏపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ చేస్తున్న రాజకీయాల మూలనా నేటి యువతరం భవిష్యత్‌‌ దెబ్బతింటుందని అధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జగన్‌కు కేవలం రాజకీయాలు, అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు తప్పా.. యువత గురించి, రాష్ట్రం భవిష్యత్ గురించి ఏమాత్రం ఆయనకు బెంగ లేదని అంటున్నారు. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయనకు అది ఏమాత్రం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనలో అంత మంచే జరిగితే ఎందుకు ఆయన నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ప్రశ్నిస్తున్నారు.దీనికి వైసీపీ నాయకుల వద్ద సమాధానం ఉందా? అని కూటమి నేతలు నిలదీస్తున్నారు.

జగన్‌కు ఇవన్నీ కనిపించడం లేదా?

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయింది. అదంతా గత పాలన చలవే. జగన్ అడ్డగోలుగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ఫలితంగా గతంలో అప్పులు తెచ్చిన దగ్గర రూ.వేల కోట్లలో వడ్డీలు కట్టడమే ప్రస్తుత ప్రభుత్వానికి సరిపోతుంది. ఇంకా అభివృద్ధికి, ఉద్యోగుల జీతాలు, విద్యార్థుల రీయింబర్స్ మెంట్, రైతుల రుణమాఫీకి నిధులు సరిపోవడం లేదని కూటమి సర్కార్ చెబుతున్నది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, రాజధాని అమరావతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు కేంద్రం చుట్టూ ఎన్ని సార్లు తిరుగుతున్నారో జగన్‌కు గానీ, వైసీపీ నేతలకు కనిపించడం లేదా? అని తెలుగు తమ్ముళ్లు, కూటమి నేతలు మండిపడుతున్నారు.

పెట్టుబడులను అడ్డుకుంటారా?

Advertisement

ఇకపోతే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఇతర మల్టీనేషనల్, దేశీయ దిగ్గజ కంపెనీలు ఆర్థిక రాజధాని విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇచ్చేందుకు సిద్దమైంది.తక్కువ ధరకే భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. అయితే, ఇది పెద్ద ల్యాండ్ స్కామ్‌గా వర్ణిస్తూ వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. తాజాగా విశాఖలో అభివృద్ధి చేయనున్న రహేజా ఐటీ పార్క్ భూ కేటాయింపుల విషయంలో సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కానిస్టిట్యూషన్ పేరిట వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి తోడు గతంలో టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా, లులూ మాల్ వంటి సంస్థలకు భూ కేటాయింపులపైనా పిటిషన్లు దాఖలయ్యాయి.

 

Advertisement

ఇలా చేయడం వలన ఆ సంస్థలు మరల బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. గతంలో జగన్ అరాచక పాలన భరించలేక అమరరాజా బ్యాటరీస్ సంస్థ పొరుగురాష్ట్రానికి తరలిన విషయం మరిచారా? అంటూ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తుంటే.. ఇలా పెట్టుబడులు పెట్టే వారిని అడ్డుకుంటే నేటితరం యువతకు రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా లభిస్తాయి. మరల వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిందేనా? అని కూటమి నేతలు నిలదీస్తున్నారు. మీరు ఎలాగూ పెట్టుబుడులు తేలేదు. ఉద్యోగ కల్పన చేయలేదు. మీరు చేయనిది తాము చేస్తుంటే ఎందుకు ప్రతిదానికి అడ్డుపడుతున్నారని అధికారపార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది ఏపీ యువత భవిష్యత్ మీద దెబ్బకొట్టడం కదా? జగన్ అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు.

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×