Annamayya District: అన్నమయ్య జిల్లాలో టెన్త్ క్లాస్ పాసైన వివాహిత మహిళలకు ఇది గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు జిల్లాల వారిగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. తాజాగా అన్నమయ్య జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 116 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 116 (ఇందులో కార్యకర్తల అంగన్వాడీ వర్కర్ 11, మినీ అంగన్వాడీ వర్కర్ 12, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 93 ఉన్నాయి )
రాజంపేట, రాయచోటి, టి.సండుపల్లి, తంబలపల్లి, బి.కొత్తకోట, చిట్వేల్, LR పల్లి, మదనపల్లి, పీలేర్, రైల్వే కోడూరు, వాల్మీకిపురం ప్రాజెక్టుల పరిధిలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: వయోపరిమతి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జనవరి 2
దరఖాస్తు విధానం: ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. బయోడేటాతో పాటు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి, ICDS ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.
Also Read: YCP on TDP Alliance: మీ అంతుచూస్తాం.. వాళ్లు మళ్లీ నోటికి పని చెబుతున్నారు
ఎంపిక విధానం ఇలా.. :
ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వివాహిత మహిళలకు ఇది మంచి అవకాశం..