BigTV English

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !
Advertisement

Diwali 2025: దీపావళి పండగ హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండుగ. కాంతి, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావించే ఈ రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అయితే.. దీపావళి రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమా? ఈ పర్వదినం రోజు అపశకునంగా భావించే పనుల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అమావాస్య.. దీపావళి నాడు కొత్త వస్తువులు కొనొచ్చా ?

సాధారణంగా.. దీపావళి వేడుకలు ధన త్రయోదశి రోజున మొదలవుతాయి. ఈ ధన త్రయోదశి రోజునే బంగారం, వెండి, కొత్త పాత్రలు లేదా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు కొనుగోలు చేసిన వస్తువులు అక్షయమై.. ఏడాది పొడవునా సంపదను పెంచుతాయని నమ్మకం.


అయితే.. దీపావళి ప్రధాన రోజున కూడా కొత్త వస్తువులు కొనడం శుభప్రదమే. లక్ష్మీదేవి పూజకు ముందుగా లేదా రోజులో ఏదైనా శుభ ముహూర్తంలో కొత్త వస్తువులు.. ముఖ్యంగా వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బట్టల వంటివి ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు.

తప్పకుండా కొనాల్సిన వస్తువులు:

లక్ష్మీ గణపతి విగ్రహాలు: దీపావళి పూజ కోసం కొత్త విగ్రహాలు కొనడం చాలా మంచిది.

భీమసేని కర్పూరం: కర్పూరం సువాసన ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్మకం.

నల్ల పసుపు: దీనిని లక్ష్మీ పూజలో ఉంచి.. తర్వాత డబ్బు పెట్టే స్థలంలో ఉంచితే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెబుతారు.

దీపావళి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు:

పండగ రోజు పవిత్రతను, సానుకూల వాతావరణాన్ని కాపాడుకోవడానికి హిందూ ధర్మంలో కొన్ని పనులను నిషిద్ధంగా భావిస్తారు.

1. ఇంటిని శుభ్రం చేయడం, బూజు దులపడం: దీపావళి పండగకు ముందు రోజుల్లో ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పండగ రోజున బూజు దులపడం లేదా ఊడ్చడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి, ఇంటి నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు.

2. చీకటిలో ఉంచడం: దీపావళి అంటేనే దీపాల పండగ. అందుకే.. ఇంటి లోపల, వెలుపల ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి ఉండకూడదు. ఇంట్లో చీకటి ఉంటే అశుభం కలుగుతుందని భావిస్తారు. విరిగిన, పగిలిన దీపాలను వెలిగించకూడదు.

3. మాంసాహారం తీసుకోవడం: పండగ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. మాంసాహారం వండటం లేదా తీసుకోవడం వల్ల దేవతలకు అసంతృప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Also Read: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

4. తులసిని తాకడం లేదా ఆకులు తెంపడం: దీపావళి రోజున తులసి దేవి విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు. కాబట్టి.. ఆ రోజు తులసి ఆకులను తీయడం, లేదా అనవసరంగా తులసి మొక్కను తాకడం మానుకోవాలి.

5. డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం: దీపావళి రోజున అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతారు. ఈ రోజు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయకూడదు.

6. గొడవలు, కోపం: పండగ వాతావరణం శాంతియుతంగా.. సంతోషంగా ఉండాలి. దీపావళి రోజున ఇంట్లో గొడవలు పడటం, కోపంగా ఉండటం, ఇతరులను నిందించడం లక్ష్మీదేవికి అప్రీతి కలిగిస్తుంది.

ఈ పవిత్రమైన రోజున నియమాలను పాటిస్తూ.. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా  ఇంట సిరిసంపదలు నిండుతాయని, ఆయురారోగ్యాలు లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు.

Related News

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

Dhanteras 2025: ధన త్రయోదశి నాడు ఈ సమయంలో బంగారం కొంటే.. కుబేరులవుతారు

Diwali 2025: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Big Stories

×