Radhika -Sarath Kumar : సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar)ప్రస్తుతం డ్యూడ్ సినిమా(Dude Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యువ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ఈ క్రమంలోనే చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే నటుడు శరత్ కుమార్ సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శరత్ కుమార్ సినిమాల గురించి అలాగే తన భార్య రాధిక(Radhika) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాధిక సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆమె నటన పరంగా ఎంతో గొప్ప నటి అని తెలిపారు. తన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత సినిమాలకి ఇచ్చిందని తెలిపారు. తన తండ్రి ఒకానొక సమయంలో అరెస్టయి జైలులో ఉన్నప్పుడు కూడా ఆమె సినిమాకే ప్రాధాన్యత ఇచ్చి సినిమాలలో నటించారని తెలిపారు. ఇలా హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ టీవీ స్టార్ గా కూడా కొనసాగారని శరత్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకు ఎన్నో అద్భుతమైన సేవలు చేసిన రాధికను భారత ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించలేదని ఈయన తెలిపారు.
ఆమె నటన పరంగా ఎంతో అద్భుతమైన నటి కానీ ఆమె నటనను భారత ప్రభుత్వం గుర్తించలేదని తనకు ఇప్పటివరకు ఒక నేషనల్ అవార్డు(National Award) కూడా రాలేదు అంటూ ఈయన నేషనల్ అవార్డు జ్యూరీ గురించి మాట్లాడుతూ కొంత పాటీ నిరత్సాహం వ్యక్తం చేశారు. ఇక తెలుగులో చిరంజీవితో(Chiranjeevi) కలిసి రాధిక సుమారు 28 సినిమాలలో నటించారు. ఇలా అన్ని సినిమాలలో ఒక హీరోతో కలిసిన నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆమె కెరియర్ చూస్తే కనుక ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు భారత ప్రభుత్వం తనని గుర్తించి అవార్డుతో సత్కరించలేకపోయిందని తెలిపారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా రాధిక..
ఇలా శరత్ కుమార్ రాధిక గురించి అలాగే ఆమెకు నేషనల్ అవార్డు రాకపోవడం గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు శరత్ కుమార్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి గొప్ప వాళ్లను గుర్తించి అవార్డులు ప్రకటిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక రాధిక ఇప్పటికి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ రాధిక కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా ఈమె సీనియర్ హీరోలు అందరి సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
Also Read: Mega 158: మెగా 158 లో మరో సూపర్ స్టార్… మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నావా బాబీ?