BigTV English

Ambati Rambabu: బన్నీని బద్నాం చేస్తున్న అంబటి? ఈ టైంలో సోఫాలేంటి?

Ambati Rambabu: బన్నీని బద్నాం చేస్తున్న అంబటి? ఈ టైంలో సోఫాలేంటి?

Ambati Rambabu: ఎవ్వరు వదిలినా, పుష్ప ను మాత్రం ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వదిలేలా లేరు. పుష్ప 2 కోసం సినిమా యూనిట్ ను మించిన ప్రచారం అంబటి భుజస్కంధాలపై మోశారని చెప్పవచ్చు. అసలే జరిగిన దుర్ఘటనతో బన్నీ కేసులో ఉండగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ డీలా పడ్డ విషయం తెల్సిందే. అయితే మాజీ మంత్రి అంబటి మాత్రం తన ట్వీట్స్ తో రెచ్చగొట్టే ధోరణికి పాల్పడుతున్నారన్నది బన్నీ ఫ్యాన్స్ మాట. మరి అంబటి ఇప్పటికైనా మారండి అంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు.


పుష్ప 2 సినిమా పుణ్యమా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విడుదల సమయంలో ఎవరైనా పుష్ప 2 ను అడ్డుకుంటే, ఊరుకొనేది లేదని అంబటి అన్నారు. అయితే సినిమా విడుదలైంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించాయి. టికెట్ ధరలను కూడా పెంచాయి. సినిమా నిర్మాతలకు రెండు ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాయి. అయితే సినిమా విడుదల సంధర్భంగా సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో, తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ మృతి చెందగా, ఒక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఇప్పుడిప్పుడే ఆ బాబు కూడా కోలుకుంటున్నాడు.

ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ విమర్శలు వినిపించాయి. అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేసి, బన్నీని అరెస్ట్ చేశారు. బెయిల్ పై బన్నీ విడుదలయ్యారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతోంది. అయితే అంబటి మాత్రం సంధ్య థియేటర్ ఘటన పుణ్యమా అంటూ మళ్లీ ట్వీట్ చేశారు. ఈసారి ట్వీట్ చేసింది మాత్రం భాదితుల కోసం కాదు, బన్నీ కోసమే. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అంటూనే.. బన్నీ అరెస్ట్ అప్రజాస్వామ్యమని తన వాదన వినిపించారు. అంతేకాదు బన్నీకి బెయిల్ వచ్చిన వెంటనే, పద్మవ్యూహం నుండి వస్తున్న అభిమన్యుడంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు పలు ట్వీట్స్ తో అంబటి హల్చల్ చేశారు.


ఒక మహిళ మృతి చెందితే, సానుభూతి కూడా వ్యక్తం చేయకుండా అంబటి నేరుగా బన్నీకి మద్దతు తెలపడంపై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ సాగించారు. తాజాగా ఈ వివాదంకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టాలీవుడ్ ఏకమైంది. మహిళ కుటుంబానికి అండగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించడమే. గురువారం టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో సినిమా విడుదల సమయంలో దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, టాలీవుడ్ సహకారం ఎలా అందించబోతోందనే కోణంలో చర్చలు సాగాయి. అందుకు టాలీవుడ్ కూడా ఒకే అంది.

ఈ టైమ్ లో అంబటి వివాదాస్పద ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందేనంటూ ట్వీట్ చేశారు. పుష్ప 2 సినిమాలో పొలిటీషియన్ వద్దకు వెళ్ళిన పుష్ప, సోఫా ద్వార నగదు బదిలీ చేసిన విషయం తెల్సిందే. అదే సీన్ ను ఉటంకిస్తూ, సీఎం తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ అనంతరం అంబటి ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది. ఒక ప్రాణం పోయింది. మరో ప్రాణంను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టింది.

Also Read: CM Revanth Reddy: సీఎం సార్.. మీరే కరెక్ట్.. అస్సలు తగ్గొద్దు!

మరోమారు ఏ ప్రాణనష్టం వాటిల్లకుండ తీసుకొనే చర్యలకు టాలీవుడ్ తో సీఎం భేటీ సాగితే, సోఫా చేరాల్సిందేనంటూ ట్వీట్ చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బన్నీ ఫ్యాన్స్ కూడా ఏం జరిగిందో తెలియకుండా, ఇష్టారీతిన అంబటి స్పందించడం తగదని సీరియస్ అవుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వివాదాస్పద ట్వీట్స్ చేసే ముందు మాజీ మంత్రి అంబటి ఆలోచించుకోవాలని టాలీవుడ్ పెద్దలు తమ స్పందన తెలుపుతున్నారు. మరి ఇప్పటికైనా అంబటి ఫుల్ స్టాప్ పెడతారా.. ఇలాగే తన ట్వీట్ హవా సాగిస్తారా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×