Mega 158: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన విశ్వంభర సినిమా షూటింగ్ పనులను పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మన శంకర ప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. తద్వారా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు.
ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబి(Bobby) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వచ్చింది. నవంబర్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూట్ కి పనులను కూడా ప్రారంభించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో దర్శకుడు బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇతర నటీనటుల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరొక సూపర్ స్టార్ భాగం కాబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే దర్శకుడు బాబి అలాగే చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడం కోసం మలయాళ సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్(Mohanlal) ను సంప్రదించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఇందులో మోహన్ లాల్ అయితే అద్భుతంగా సెట్ అవుతారనే ఉద్దేశంతోనే చిత్ర బృందం ఆయనని సంప్రదించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మెగాస్టార్ చిరంజీవితో సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమా చేయడానికి అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మల్టీ స్టారర్ సినిమా?
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. మరి మెగా 158 సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఇటీవల కాలంలో నటుడు మోహన్ లాల్ తెలుగు సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈయన మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక చిరంజీవి మోహన్ ల్ కలిసి కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో పలువురు అభిమానులు మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదివరకు చిరంజీవి బాబి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Amala Akkineni: నేను డిమాండ్ చేసే అత్తను కాదు.. నా సర్కిల్ బాగా పెరిగింది: అమల