AP Govt on BPS: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(BPS)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 31, 2025 లోపు అనుమతులు లేకుండా నిర్మించిన 59,041 భవనాలు, 9,985 అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 49,056 భవనాలు క్రమబద్దీకరించుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
స్థిరాస్తి వ్యాపార సంస్థల విజ్ఞప్తుల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీపీఎస్ పథకం ద్వారా ఆగస్టు 31, 2025 లోపు అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులు, అలాగే అనుమతులు లేకుండా విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. నరెడ్కో, క్రెడాయ్ వంటి స్థిరాస్తి సంస్థల విజ్ఞప్తుల మేరకు బీపీఎస్‌ను బిల్లును ఆమోదించినట్లు తెలుస్తోంది.
బీపీఎస్ అమలుపై రానున్న రెండు, మూడు రోజుల్లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా అక్రమ నిర్మాణాలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఎంతో మంది పేదవారికి ఊరట లభించనుంది. అనుమతిలేకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి సొంత గూడు లభించనుంది.
నాలా చట్టం రద్దు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దాని స్థానంలో భూముల వ్యవసాయేతర వినియోగానికి బాహ్య అభివృద్ధి రుసుములు వసూలు చేసే కొత్త ఆర్డినెన్సుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు.
ఏపీ ప్రభుత్వం భవన అనుమతులకు కొత్త విధానాన్ని అమలుచేస్తుంది. దరఖాస్తుదారుల నుంచి నిర్దేశిత రుసుము వసూలు చేసి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు అనుమతులు జారీ చేయనున్నాయి.
Also Read: AP Politics: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..
ఇకపై 18-24 మీటర్ల ఎత్తు భవనాలు నాన్ హైరైజ్ కేటగిరీలోకి వస్తాయి. ఈ భవనాలకు అగ్నిమాపక శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదు. మహారాష్ట్ర తరహాలో చట్ట సవరణలు చేయడంతో బిల్డర్లు, ప్రజలకు ఇబ్బందులు తగ్గనున్నాయి.