NER Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ భారీ గుడ్ న్యూస్. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్‌పుర్ (NER) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు. పదో తరగతి, ఐటీఐ పాసైన వారికి ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్‌పుర్ (NER) వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1104
నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్‌పుర్ (NER) లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
యూనిట్ల వారీగా అప్రెంటీస్ వివరాలు..
మెకానికల్ వర్క్‌షాప్/గోరఖ్‌పుర్: 390 పోస్టులు
సిగ్నల్ వర్క్‌షాప్/గోరఖ్‌పుర్: 63 పోస్టులు
బిడ్జి వర్క్‌షాప్/గోరఖ్‌పుర్: 35 పోస్టులు
మెకానికల్ వర్క్‌షాప్/ఇజ్జత్‌నగర్: 142 పోస్టులు
డీసిల్ షెడ్/ఇజ్జత్‌నగర్: 60 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్/ఇజ్జత్‌నగర్: 64 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్/ లఖ్‌నవూ: 149 పోస్టులు
డీసిల్ షెడ్/గోండ: 88 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్/వారణాసి: 73 పోస్టులు
టీఆర్‌డీ వారణాసి: 40 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు అప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
వయస్సు: 2025 అక్టోబర్ 16 వ తేది నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎగ్జామ్ ఫీజు రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 15
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ner.indianrailways.gov.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1104
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 15
ALSO READ: Viral News: దీపావళి వేళ 51 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు, మళ్లీ వైరల్ వార్తల్లోకి ఎక్కిన భాటియా!