ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య విభాగం (DME) రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొత్తం 22 స్పెషాలిటీ విభాగాల్లో కలిపి 284 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకాలు దోహదం చేస్తాయి.
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ (MD) లేదా ఎంఎస్ (MS) లేదా డీఎన్‌బీ (DNB) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతలతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
వయస్సు:
వయోపరిమితి విషయానికి వస్తే క్లినికల్ విభాగాల్లో దరఖాస్తు చేసే వారికి గరిష్టంగా 44 ఏళ్లు ఉండాలి. ఇతర విభాగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇచ్చారు.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.80,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 మార్చి 25 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా 2026 మార్చి 29ని నిర్ణయించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులకు ఇది చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులు రూ.2000 చెల్లించాలి. బీసీ అలాగే ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పీజీ పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కులు అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాష్ట్ర స్థానిక అభ్యర్థులకు నియామకాల్లో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://dme.ap.nic.in/
ALSO READ: UPSC Notification: యూపీఎస్సీ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. మంచి వేతనం, దరఖాస్తుకు ఇంకా 6 రోజులే