E-Paper
Advertisement

నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు! కాంగ్రెస్సోళ్ల‌ని ఉర్కిచ్చి ఉర్కిచ్చి కొడ‌తా! ఇక కేటీఆర్ మార్క్ పాల‌న‌ట‌..

నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు! కాంగ్రెస్సోళ్ల‌ని ఉర్కిచ్చి ఉర్కిచ్చి కొడ‌తా! ఇక కేటీఆర్ మార్క్ పాల‌న‌ట‌..
Advertisement

కేటీఆర్ మంచి క‌సి మీదున్నాడు. ఇంకా రెండేండ్లు ఎప్పుడు గ‌డుస్తాయోనని టెన్ష‌న్‌తో ఎదురు చూస్తున్న‌ట్టున్నాడు. ఏ మీటింగుకు పోయినా.. ఇంకో రెండేండ్లు ఓపిక ప‌ట్టుర్రి మ‌న‌మే వ‌స్తున్నామ‌ని ధీమాగా చెబుతూ వ‌స్తున్నాడు. జ‌నాలు త‌ప్పు తెలుసుకున్నార‌నీ అంటున్నాడు. కేసీఆర్ యాడున్నావ్‌..!? అని ఇప్పుడు దీనంగా అరుస్తున్నారు.. ఆయ‌న ఏడుండాల్నో ఆడ‌నే ఉన్న‌డు.. ఆయ‌న మంచిగ‌నే ఉన్న‌డు.. కానీ న‌ష్టం ఎవ‌రికీ? అని జ‌నాల్ని నిల‌దీస్తున్నాడు.

జ‌నానికి న‌ష్టం జ‌రిగినా ఆయ‌నకు సంబంధం లేద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయ‌న ఏడుండాల్నో ఆడ‌నే ఉన్న‌డంటే.. ఓడ‌గొట్టారు కాబ‌ట్టి.. ఫామ్‌హౌజ్‌ల‌నే ఉంటాడ‌ని స‌మ‌ర్థించుకుంటున్నాడు. కేసీఆర్‌ను త‌క్కువ అంచ‌నా వేశారు.. బాగైంద‌నే విధంగా , బుద్దొచ్చిందా..? అని చిన్నపిల్ల‌లు మారాం చేస్తే తొడ‌పాశం పెట్టి మ‌రీ అడిగిన‌ట్టు జ‌నాల‌ను అడుగుతున్నాడు.

Advertisement

ఎట్టి ప‌రిస్థితుల్లో ఇలాంటి త‌ప్పు ఇక‌పై చేయ‌కండి అని చెబుతున్న‌ట్టే చెబుతున్నాడు. చేస్తే చస్తార‌ని బెదిరించిన‌ట్టే బెదిరిస్తున్నాడు. మ‌ళ్లీ చేస్తే ఇంకా ఇంకా అనుభ‌విస్తారు.. మాకేం న‌ష్టం లేదు.. అని ఫామ్‌హౌజ్‌లో ఉండి త‌మాషా చూస్తామ‌న్న‌ట్టే క‌న్నెర్ర చేస్తుండు. ఇదే తీరు. ఎక్క‌డికి వెళ్లినా.. ఏ మీటింగులో మాట్లాడినా.. దాదాపుగా ఇవే మాట‌లు. అటూ ఇటూగా.

ఇవాళ ప‌ర‌కాల బీఆరెస్ జ‌న‌రల్ బాడీ మీటింగులో కూడా ఇవే మాట‌లు రిపీట్ అయ్యాయి. వీటితో పాటు ఇంకో డైలాగు కూడా. అదీ పాత‌దే. కానీ.. కొంచెం ఘాటుగా. లోతుగా. త‌న‌లోని క‌సి, కోపం ఏ స్థాయిలో ఉందో చూపేందుకు ఓ కొల‌మానంలా ఉన్నాయా మాట‌లు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాద‌న్నాడు. ఇది గ‌తంలో కూడా అన్న‌దే. అంత మంచోడ‌ని ఎవ‌రూ అనుకోవ‌డం లేదు కూడా. దాన్ని ప‌దే ప‌దే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఈ వ్యాఖ్య‌ల‌ను త‌ను ఎందుకు వాడుకున్నాడంటే.. కేసీఆర్ అప్పుడు చాలా మందిని క్షమించి వ‌దిలేశాడు కానీ.. తానైతే ఎవ‌రినీ వ‌ద‌ల‌న‌ని చెప్ప‌డానికి.

Advertisement

తాము ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి మొత్తం లెక్క‌లు రాసుకుంటున్నాడ‌ట‌. ఎవ‌రెవ‌రు ఏమేమీ చేస్తున్నారో అన్నింటినీ చూస్తున్నాడంట‌.. ఎవ‌రినీ వ‌ద‌ల‌డ‌ట‌. పారిపోయినా ప‌ట్టుకొచ్చి తంత‌డ‌ట‌. స‌ప్త స‌ముద్రాల‌వ‌త‌ల ఉన్న గుంజుకొచ్చి గుద్దుత‌డ‌ట‌. చంపి పాత‌రేస్తాడ‌ట‌. కాంగ్రెస్ లీడ‌ర్లారా జాగ్ర‌త్త‌! రెండేండ్లే మీకు టైము.. ఇగ ఉంట‌ది సూడు మీ త‌మాషా! అని తొడ‌లు చ‌రిచి మ‌రీ వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేశాడు కేటీఆర్‌.

అనడం కాంగ్రెసోళ్ల‌ని అన్న‌డు కానీ.. ఇందులో జ‌ర్న‌లిస్టులు, ఆఫీస‌ర్లు, పోలీసులు, సోష‌ల్ మీడియా వ‌ర్క‌ర్లు.. అంతా ఉంటారన్న‌మాట‌. కేటీఆర్‌ది ఒక‌టే గుడ్డి లెక్క‌. త‌మ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వాళ్ల‌ని, ఎదురు మాట్లాడిన వాళ్లని, విమ‌ర్శించినోళ్ల‌ని, ప్ర‌శ్నించినోళ్ల‌ని.. వీరితో పాటు ఇబ్బంది పెట్టినోళ్ల‌ని అంద‌రినీ క‌ట్ట‌క‌ట్టి మ‌రీ బ‌జాయిస్త‌డ‌న్న‌మాట‌. ఒక్కొక్క‌రినీ ఒక్కో టైపుగా.

ఆ పదేండ్ల పాల‌న లా ఇక‌పై ఉండ‌ద‌ని కూడా అన్నాడు. అంటే అంత‌క‌న్నా దారుణంగా ఉండ‌బోతున్నామ‌ని కూడా సిగ్న‌ల్ ఇచ్చాడు. మేము త‌ప్ప‌.. జ‌నానికి ఇంకో ఆల్ట‌ర్నేట్ లేద‌నే అంచ‌నాతో అన్న మాట‌ల‌వి. చ‌చ్చిన‌ట్టు మమ్మ‌ల్ని గెలిపిస్తార‌నే ప‌లుకుల‌వి.

Related News

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

సీఎం కోట ముందు కవిత ఛాలెంజ్‌….నేను బహుజన బాణాన్ని.. ఏ పార్టీకి తొత్తును కాదు..!

కానరాని వైష్ణవిలెందరో..!? ప్రతీకార హత్యలకు కారకులెవరు? వెన్నుతట్టి ప్రోత్సహించిన నెటిజన్లది! రెచ్చగొట్టిన జనానిది..!

ఆ ఎమ్మెల్యేది క్రెడిట్‌ చోరీ కాదు.. జనం దిల్‌ చోరీ..! మన తెలుగు నేతల లెక్క క్రెడిట్‌ కోసం కొట్టుకోలేదు.. ప్రతిపక్షానికే క్రెడిట్‌ ఇచ్చిన వైనం..!

Big Stories

Advertisement
×