E-Paper
Advertisement

టీవీలో టాప్.. సినిమాల్లో ఫ్లాప్.. అసలు మిస్టరీ ఇదే!

టీవీలో టాప్.. సినిమాల్లో ఫ్లాప్.. అసలు మిస్టరీ ఇదే!
Advertisement

TV Stars:సినిమాలకైనా అడపాదడపా వెళ్తుంటాం కానీ బుల్లితెరపై వచ్చే ఏ చిన్న ఈవెంట్ ని కానీ మనం మిస్ అవ్వము. ఎందుకంటే ఆ టీవీ ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటుంది మరి.ఇక ఆ బుల్లితెరపై కనిపించే, మనల్ని ఎంటర్టైన్ చేసే చాలా మంది ఎందుకు హీరోలుగా, హీరోయిన్స్‌గా రాణించలేకపోయారు అన్న అనుమానం మనకు రావడం సహజం.అరే… వీళ్లు ఇక్కడ ఇంత అదరగొడుతున్నారు కదా… అదే వెండితెరపైకి వెళ్లి ఉంటేనా… అని అనిపిస్తుంది కూడా.ఇక వీరు ఈవెంట్లలో, షోలలో, ప్రోగ్రామ్స్‌లో పేల్చే కామెడీకి సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా.మరి అలాంటి వీరు కేవలం బుల్లితెరపైనే ఎందుకు సక్సెస్ అయ్యారు? వెండితెరపై ఎందుకు సక్సెస్ కాలేదు? అసలు వారు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.

టీవీ క్రేజ్… సినిమా సక్సెస్‌కు సరిపోతుందా?

చాలామంది ఏమనుకుంటారంటే… టీవీలో నాకు సాలిడ్ ఫాలోయింగ్ వచ్చింది కదా, ఇక హీరోగా చేసేసి ఇండస్ట్రీ ఏలేద్దాం అనుకుంటారు.కానీ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే… ఆడియన్స్ టీవీలో ఇంట్లో కూర్చొని సరదాగా నచ్చింది తినుకుంటూ చూస్తూ ఉంటారు. నచ్చలేదంటే మరో ఛానల్‌కి వెళ్లిపోతారు.కానీ సినిమాకి రావాలంటే మాత్రం ఏదో ఒక గట్టి మోటీవ్ ఫోర్స్ వాళ్లకు ఉండి తీరాల్సిందే. ఖచ్చితంగా సినిమా చూసేయాలి అంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వారు వెళ్లాల్సిందే.

Advertisement

అందుకు చాలా సమయం కూడా గడపాల్సి ఉంటుంది.అందుకే టీవీలో పాపులర్ అయిన ప్రతి ఆర్టిస్ట్‌ను ప్రేక్షకుడు హీరోగా ఒప్పుకుంటాడా అంటే అనుమానమే.

సుడిగాలి సుదీర్… ఫ్యాన్స్ ఉన్నా ఫలితం రాలేదు

ఉదాహరణకు సుడిగాలి సుదీర్ నే తీసుకుంటే సోషల్ మీడియాలో ఈయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ఈయన కోసమే స్పెషల్‌గా ఈవెంట్లని, ప్రోగ్రాంలని ఆడియన్స్ చూస్తుంటారు కూడా.

Advertisement

కానీ ఇంత ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుదీర్ కూడా ఇండస్ట్రీకి హీరోగా వెళ్లాక అసలు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. సహస్ర కాలింగ్, గాలోడు… ఇలా చేసినప్పటికీ వర్కౌట్ కాక మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అంటూ బుల్లితెరపై ఈవెంట్లు, సీరియల్స్, షోలు చేసుకోవాల్సిన పరిస్థితి.

ఇక్కడ సమస్య ఏంటి అంటే… సినిమా హిట్ కావాలంటే ఫ్యాన్స్ ఒక్కటే ఉంటే సరిపోదు.బలమైన కథ, మంచి డైరెక్షన్, సరైన ప్రమోషన్స్ కూడా ఉండి తీరాలి.

ప్రదీప్ మాచిరాజు… మరోసారి వెండితెరపై ట్రై

ఇక బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న ప్రదీప్ మాచిరాజు విషయానికి వస్తే… డి, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా వంటి ఎన్నో ప్రోగ్రామ్స్‌తో తెలుగు ఆడియన్స్ అందరికీ దగ్గరైన ప్రదీప్ సినిమాల్లో అడుగుపెట్టినప్పటికీ అక్కడ హీరోగా రాణించలేకపోయాడు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి సినిమాలు చేసిన ప్రదీప్ తర్వాత బ్యాక్ టు పెవిలియన్ అంటూ మళ్లీ బుల్లితెరపైకి వచ్చేశాడు. ఇప్పుడు మళ్లీ బుల్లితెరను దాటి వెండితెరపైకి అడుగు పెట్టాలని ట్రై చేస్తున్నాడు.

రష్మి గౌతమ్… హీరోయిన్ కంటే యాంకర్‌గా బెటర్

ఇక బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో సత్తా చాటుతున్న రష్మి గౌతమ్ కూడా హీరోయిన్‌గా ప్రయత్నించి ఫెయిల్యూర్ చూసింది.అయితే తను హీరోయిన్‌గా చేసిన అంతకుమించి వంటి సినిమాలు సరిగ్గా ఆడకున్నప్పటికీ రష్మి గౌతమ్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.

తాజాగా చేస్తున్న ఈవెంట్లని బట్టి చూస్తుంటే రష్మి ఇప్పుడు వెండితెరపై కన్నా బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది.

అనసూయ… సినిమాలు చేసినా టీవీయే మెయిన్

ఇక జబర్దస్త్‌తో కోట్లాది మంది ఆడియన్స్‌కు దగ్గరైన అనసూయ కూడా ఒకప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నదే.ఇక అడపాదడపా రంగస్థలంలో రంగమ్మత్త లాంటి పాత్రలు చేస్తున్నప్పటికీ తన మెయిన్ ఫోకస్ బుల్లితెరపైనే.

హైపర్ ఆది – గెటప్ శ్రీను… హీరోలు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా

ఇక జబర్దస్త్‌తో ఎంతోమంది ఆడియన్స్‌కు దగ్గరైన హైపర్ ఆది, గెటప్ శ్రీను కూడా సినిమాల్లో అవకాశాలు అడపాదడపా అందుకున్నప్పటికీ ఇక్కడ హీరోల వేషాలు వేయకుండా కేవలం తమకు అచ్చొచ్చిన కామెడీ రోల్స్ వేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

అయితే రాజు యాదవ్ అంటూ హీరోగా ఒక సినిమా తీసిన గెటప్ శ్రీను ఇప్పుడు తన ఫోకస్ మొత్తం హీరో ఫ్రెండ్ రోల్స్‌పై పెట్టినట్టు కనిపిస్తుంది.ఈ మధ్య వచ్చిన లెనిన్ వంటి చాలా సినిమాల్లో అలరించాడు కూడా.

అసలు కారణం ఇదేనా?

అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే… సినిమా హీరో మహా అయితే ఏడాదికి ఒక రెండు సినిమాల్లో కనిపిస్తారు. అందుకే వాళ్లపై ఆడియన్స్‌కు అంత ఆసక్తి ఉంటుంది.

కానీ టీవీలో నటించే నటులు మాత్రం డైలీ వాళ్ల జీవితంలో కనిపిస్తూనే ఉంటారు. సో… పెద్ద తెరపై కనిపించినప్పుడు రావాల్సిన క్యూరియాసిటీ రాదనేది చాలామంది చెబుతున్న మాట.

also read:బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

టీవీ నుంచి సినిమాల్లోకి రావడం తప్పు కాదు. కానీ టీవీ నుంచి వచ్చిన క్రేజ్‌తో సినిమా కూడా హిట్ అవుతుంది అనుకోవడం మాత్రం భ్రమ.సరైన కథ, మంచి క్యారెక్టర్, ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే యాక్టింగ్… ఇవన్నీ కలగలిపి వస్తే టీవీ ఆర్టిస్టులు కూడా వెండితెరపై సత్తా చాటగలరు. దీన్ని చాలా మంది ఇప్పటికే ప్రూవ్ చేశారు కూడా.

Tags

Related News

లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న హీరో శ్రీకాంత్!

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి?

సుధీర్ ది రియల్ హెయిర్ కాదా?విగ్గా? బయటపడ్డ నిజం!

ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?

Karthika Deepam 2 jyo : కార్తీక దీపం విలన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన ప్రభావతి.. పాపం రోహిణి..

Big Stories

Advertisement
×