BigTV English

SEBI: రూ.1,26,000 జీతంతో సెబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, ఉద్యోగం మీదే బ్రో

SEBI: రూ.1,26,000 జీతంతో సెబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, ఉద్యోగం మీదే బ్రో
Advertisement

SEBI: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. బీఈ, బీటెక్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు ప్రారంభ వేతనమే రూ.62,500 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లో వివిధ స్ట్రీమ్ లలో ఆఫీసర్ గ్రేడ్ -ఏ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల కాలేదు.

నోట్: షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల కానుంది.


ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 110 పోస్టులు

వివిధ విభాగాల్లో ఉద్యోగ వెకెన్సీలు ఉన్నాయి. జనరల్- 56, లీగల్- 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2, సివిల్‌ ఇంజినీరింగ్‌- 3, రిసెర్చ్- 4, అఫీషియల్‌ లాంగ్వేజ్‌- 3 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎల్ఎల్‌బీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎస్, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులక మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.62,500 నుంచి రూ.1,26,100 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:  ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), ఫేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

నోట్: ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు, ఫీజు చెల్లింపు చివరి తేదీ, పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తారు.

ఫుల్ నోటిఫికేషన్: పూర్తి నోటిఫికేషన్‌కు అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sebi.gov.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 110

దరఖాస్తుకు చివరి తేది: త్వరలో వెల్లడించనున్నారు.

ALSO READ: IPPB Executive: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. ఐపీపీబీలో భారీగా ఉద్యోగాలు, స్టార్టింగ్ వేతనమే రూ.30వేలు

Related News

Bank of Baroda Jobs: మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లక్షకు పైగా జీతం, ఇంకా 10 రోజులే

IPPB Executive: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. ఐపీపీబీలో భారీగా ఉద్యోగాలు, స్టార్టింగ్ వేతనమే రూ.30వేలు

JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్

Constable Notification: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బంగారం లాంటి భవిష్యత్తు, ఇంకా 2 రోజులే..!

TGCAB Staff Assistant Posts: టీజీ క్యాబ్ బ్యాంకుల్లో 225 అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ అర్హత గల వారికి గుడ్ ఛాన్స్

SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే

Big Stories

×