Big Stories

Digital Marketing Courses :  డిజిటల్ కోర్సులు.. అవకాశాలెన్నో..!

Digital Marketing Courses : ఒకప్పుడు మార్కెటింగ్ జాబ్ అంటే టై కట్టుకుని టిప్‌టాప్‌గా తయారై సేల్స్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుటి స్మార్ట్ యుగంలో ఏ ఉద్యోగం చేసినా స్మార్ట్‌గానే చేస్తున్నారు.ముఖ్యంగా 5G వచ్చాక ప్రతి వ్యాపారం డిజిటల్‌ వైపు మొగ్గు చూపుతోంది. దీంతో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు నేర్చుకున్న యువత.. నేడు రూ.లక్షల్లో జీతాలు పొందుతున్నారు. మరి మీరూ అవుతారా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు?

- Advertisement -

గూగుల్‌లో ఉచిత కోర్సులు..
డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు కావాలంటే.. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO), సోషల్ మీడియా, వెబ్‌సైట్ ట్రాఫిక్ విశ్లేషణ వంటి కోర్సులు నేర్చుకోవాలి. ఈ కోర్సులను గూగుల్ తన లెర్నింగ్ పోర్టల్‌లోని ఆన్‌లైన్ కోర్సుల్లో నమోదు చేసుకున్న వారు కోర్సు ట్యుటోరియల్స్, ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు. ఈ కోర్సులు చేయడానికి పట్టే గరిష్ఠ సమయం 1-40 గంటలే.

- Advertisement -

ఇంటర్ ఉంటే చాలు..
ఈ కోర్సులను పూర్తిగా నేర్చుకునేందుకు మూడేళ్ల యూజీ.. రెండేళ్ల పీజీ కోర్సులు కూడా ఉన్నాయి. యూజీ, పీజీ కోర్సులను IIM, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, NIFT కోల్‌కతా, ISB హైదరాబాద్, AIMA న్యూఢిల్లీ వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు చేసేందుకు కనీస అర్హత ఇంటర్ ఉంటే చాలు. ఇందులో 3-6 నెలల సర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News