BigTV English

Pushkar Mela 2023 : 8 ఏళ్లు.. 1570 కిలోల బరువు.. 150 దూడలకు జన్మనిచ్చిన దున్న..

Pushkar Mela 2023 : 8 ఏళ్లు.. 1570 కిలోల బరువు.. 150 దూడలకు జన్మనిచ్చిన దున్న..

Pushkar Mela 2023 : బాహుబలి సినిమాలో రానా ఒక దున్నతో పోరాడే సీన్ గుర్తుంది కదూ. చాలా భారీగా, బలిష్ఠంగా ఉండే ఆ దున్నను చూసి.. ఆ సినిమా వచ్చిన కొత్తలో దాని గురించే మాట్లాడుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యానిమల్ మేళా (Pushkar Mela 2023)లో దానిని మించిన దున్న కనిపించింది. బాహుబలి దున్నకంటే ఇది చాలా పెద్దది. 5.8 అడుగుల పొడవు, 1570 కిలోల బరువు ఉన్న ఈ దున్న ఇప్పటి వరకూ 150 దూడలకు జన్మనిచ్చింది.


ఈ బర్రెను దాని యజమాని తాజాగా అంతర్జాతీయ పశు మేళాలో ఏకంగా రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టడంతో ఇది వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యానిమల్ మేళాలో ఈ దున్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాని వయసు 8 ఏళ్లు. హర్యానాలోని సిర్సా ప్రాంతానికి చెందిన హర్విందర్ సింగ్.. ఈ బాహుబలి దున్నను తన సొంత బిడ్డలా పెంచాడు. దానికి అన్మోల్ అని పేరు కూడా పెట్టాడు. ప్రతిరోజూ పౌష్టికాహారం పెడతాడు. అరటిపండ్లు, గుడ్లు సహా బలమైన ఆహారాన్ని పెడతాడు. దీని పోషణకు నెలకు రూ.3 లక్షలు ఖర్చుచేస్తున్నట్లు హర్విందర్ తెలిపాడు.

ఈ దున్న వీర్యంతో ఇప్పటి వరకూ.. 40-50 కిలోల బరువున్న 150 దూడలు జన్మించాయని, అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని హర్విందర్ వెల్లడించాడు. గతేడాది 1400 కిలోల బరువున్న ఈ దున్న.. ఈ ఏడాది 1570 కిలోలకు పెరిగింది. గతేడాది నిర్వహించిన మేళాలో ఓ వ్యక్తి రూ.3 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా.. అమ్మేందుకు హర్విందర్ నిరాకరించాడు. ఈ సారి రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టగా.. అంత ఖర్చుచేసి కొనేవారికోసం ఎదురుచూస్తున్నాడు హర్విందర్. అన్మోల్ చాలా విలువైనదని, తక్కువ ధరకు మాత్రం అమ్మనని తెలిపాడు.


Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×