Big Stories

Job Tips for Freshers: ఫ్రెషర్ గా ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? ఈ టిప్స్ మీ కోసమే..!

Job Tips for Fresher Candidates: డిగ్రీ పట్టా చేతపట్టి.. ఫ్రెషర్ గా ఉద్యోగం కోసం అన్వేషించే వారు కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హైరింగ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది 62 శాతం కంపెనీలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ-కామర్స్, టెలీకమ్యూనికేషన్స్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఉద్యోగాలు ఎన్ని ఉన్నా.. అంతకు రెట్టింపు స్థాయిలో నిరుద్యోగులు ఉండటంతో.. సగానికి సగం మంది నిరుద్యోగాన్ని చవిచూడాల్సిన పరిస్థితి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నైపుణ్యాలతో సన్నద్ధం చేసుకుంటే.. ఉద్యోగం పొందడం చాలా సులువు.

- Advertisement -

ఉద్యోగానికై అన్వేషించేవారికి ఓపిక ఎక్కువగా ఉండాలి. ఒక్కోసారి మీ ఓపికే మిమ్మల్ని గెలిపిస్తుంది. స్వయం ప్రతిపత్తి, స్వీయ నియంత్రణ, క్రియాశీలత, వ్యూహాత్మక ఆలోచన ఉండటం చాలా అవసరం. ప్రతి విషయంపై లోతైన అవగాహన కలిగి ఉండాలి. రిక్రూటర్లు ఒక ప్లేస్ మెంట్ కోసమై అనేక దరఖాస్తులను కోరతారు. అందుకు మీ రెజ్యూమ్ ను నీట్ గా తయారు చేసి ఉంచుకోవాలి. ఇందులో మీ విద్యార్హతలు, నైపుణ్యం ఖచ్చితంగా ఉండాలి. మీ రెజ్యూమ్ ఏటీఎస్ (Applicant Tracking System) ఫ్రెండ్లీగా ఉండాలి.

- Advertisement -

1. మీ రెజ్యూమ్ ను స్కాన్ చేసేందుకు సులభంగా ఉండేలా తయారు చేయండి. ఏటీఎస్ ను కన్ఫ్యూజ్ చేసేలా లే అవుట్ లు, గ్రాఫిక్స్, టేబుల్స్ ను వాడకండి.

Also Read : ఇండియా పోస్ట్ లో కొలువులు.. టెన్త్ పాసైతే చాలు.. రోజుకు 4 గంటలే పని!

2. మీ విద్యార్హతతో పాటు.. స్కిల్స్, గతంలో పనిచేసిన అనుభవాన్ని క్లియర్ గా చెప్పండి.

3. మీ ఎక్స్ పీరియన్స్ ను క్లియర్ గా చెప్పే పదాలను వాడండి. మీరు సాధించిన సక్సెస్ ను వివరించండి. ఇది మీరు ఆ ఉద్యోగానికి అర్హులో కాదో సూచిస్తుంది.

4. మీ సామర్థ్యం, పనితీరు, పనిలో మీరు పాటించే నీతి, నిజాయితీలను హైలైట్ చేయండి. అలాగే మీరు నేర్చుకున్న కోర్సులు, ప్రాజెక్ట్ లు, ఇంటర్న్ షిప్ లు, స్వచ్ఛంద సేవల్ని కూడా హైలైట్ చేయండి.

5. ఇంటర్న్ షిప్ లు మీకు ఉద్యోగ అనుభవాన్ని, జనరల్ నాలెడ్జ్ ను ఇస్తాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయర్స్ (NACE) సుమారు 70% మంది యజమానులు తమ ఆన్-సైట్ ఇంటర్న్‌లకు పూర్తి-సమయ స్థానాలను అందిస్తున్నారని మీకు తెలుసా? ఇంటర్న్‌షిప్‌లను అభ్యసించడం ద్వారా, మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరిచే, ప్రొఫెషనల్ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేయడంలో మీకు సహాయపడే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌ను పొందవచ్చు.

Also Read: Postal Jobs with 10th Pass: ఇండియా పోస్ట్ లో కొలువులు.. టెన్త్ పాసైతే చాలు.. రోజుకు 4 గంటలే పని!

6. టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా.. దానికంటే ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు కంపెనీలు కూడా ఆ స్కిల్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. NACE 2023 సర్వే ప్రకారం.. వన్ అండ్ డన్ డిగ్రీలు ఇకపై సరిపోవు. సాఫ్ట్ స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్లు ఇంటర్న్‌షిప్‌లు, ఆన్‌లైన్ కోర్సులు లేదా వాలంటీర్ వర్క్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్‌ను పొందాలి.

7. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. ఇదే నూటికి నూటిశాతం నిజం. ఇంటర్వ్యూలో మీపై 7 సెకన్లలో ఒక అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మెంటల్ గా, ఫిజికల్ గా ఇంటర్వ్యూను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. మీ విద్య, అనుభవంపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. నెట్టింట్లో శోధించి తెలుసుకోండి. అలాగే డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News